హరీష్ శంకర్ దర్శకత్వంలో Vijay Deverakonda..?

0
45
Dil Raju Vijay Devarakonda Harish Shankar movie on cards

Harish Shnkar, Vijay Deverakonda: హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాను చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. లైగర్ (Liger) సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి త్వరలోనే విజయ్ దేవరకొండ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు. ఓకే ఒక షెడ్యూల్ బ్యాలెన్స్ ఉందని త్వరలోనే అది కూడా కంప్లీట్ చేసి సినిమా విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతుంది. హరీష్ శంకర్ (Harish Shnkar) తో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా ఉండనుందని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ అప్పట్లో ఓ సినిమాకి కమిట్మెంట్ ఇచ్చాడట. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ సెట్ చేయాలని నిర్మాత ఆలోచిస్తున్నారట.

మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. గబ్బర్ సింగ్ సినిమా తరువాత ఇప్పుడు పవన్ (Pawan Kalyan) అదే రేంజ్ హిట్ ఇవ్వాలని హరీష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే విజయ్‌తో సినిమా ఉండోచ్చని అంటున్నారు.