దిల్‌ రాజు తో తమిళ స్టార్ హీరో సూర్య సినిమా

149
dilraj-staright-telugu-movie-with-hero-surya
dilraj-staright-telugu-movie-with-hero-surya

తమిళ స్టార్ హీరో సూర్యకు అటు తమిళ పరిశ్రమతో పాటుగా ఇటు తెలుగులోనూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అతడి సినిమాల కోసం అక్కడి వారితో పాటుగా తెలుగు అభిమానులు కూడా ఎదురుచూస్తుంటారు. దక్షిణాదిలోనే ఎక్కువ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకడు. అతడి నటన, కథలను ఎంచుకునే తీరు చాలా విలక్షణంగా ఉంటుంది. తాజాగా.. “ఆకాశం నీ హద్దురా” సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే త్వరలో సూర్య ఓ స్ట్రయిట్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 

 

 

మాస్‌ చిత్రాల డైరెక్టర్‌ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తారట. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నారట. నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలని సూర్య ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. బోయపాటి చెప్పిన హై వోల్టేజ్‌ యాక్షన్‌ స్టోరీ సూర్యకు నచ్చిందని టాక్‌ నడుస్తోంది. దీంతో ఆ సినిమాలో నటించేందుకు సూర్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. అయితే… దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు.  ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ త్వరలోనే రానుంది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో తెరకెక్కించి హిందీ, కన్నడలో పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.