ఖ‌చ్చితంగా ఎఫ్‌ 3తో నవ్వుల వ్యాక్సిన్ వ‌స్తుంది – అనిల్ రావిపూడి

0
293
Director Anil Ravipudi Talk About F3 Movie

ఇప్పుడు ఇండస్ట్రీలో, ఆడియెన్స్‌లో ఈ పేరుకి ఓ ప్రత్యేకమైన వేల్యూ ఉంది. పటాస్‌.. సుప్రీమ్‌.. రాజాదిగ్రేట్‌.. ఎఫ్‌2… సరిలేరు నీకెవ్వరు ఇలా ఒకటి కాదు రెండు కాదు. వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్‌తో ప్రేక్షకులకు 100% వినోదాన్ని నిర్మాతలకు, బయ్యర్స్‌కు 100% లాభాలను అందించి ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్పెషల్‌ బ్రాండ్‌గా నిలిచి జెట్‌ స్పీడుతో దూసుకెళ్తూ.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి బర్త్‌ డే నవంబర్‌ 23. ఈ సందర్భంగా అనిల్ రావిపూడితో స్పెషల్‌ ఇంటర్వ్యూ…

పూర్తిస్థాయి ఫన్‌ రైడర్‌ అయిన ఎఫ్‌2 సినిమా గురించి ఏం చెబుతారు?
– కంప్లీట్‌గా నన్ను మార్చేసిన సినిమా. నాకు గేమ్‌ చేంజింగ్‌ మూవీ అనొచ్చు. మూడు యాక్షన్‌ సినిమాలు చేసిన నాకు పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం చేయాలని అనిపించింది. ఆ సినిమాకు ఎవరు యాప్ట్‌ అవుతారు అనిపించగానే వెంకటేశ్‌గారు తప్ప ఇంకొకరు నాకు కనిపించలేదు. అలాగే యంగ్‌ హీరోస్‌లో నాకెంతో క్లోజ్‌ అయిన వరుణ్‌తేజ్‌ను అనుకుని సినిమా చేశాను. నా లైఫ్‌లోని చిన్న చిన్న పర్సనల్‌ ఎక్స్‌పీరియెన్స్‌లు, పెళ్లైన ప్రతి వాడి జీవితంలో ఉండే చిలిపి సంఘటనలతో సరదాగా సినిమా చేద్దామని చేసిన సినిమా. ఫ్యామిలీ లైఫ్‌లో ఉండే ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ అంటే అందరూ కనెక్ట్‌ అవుతారనిపించింది. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. ఆ సంక్రాంతిని నవ్వుల సంక్రాంతిగా మార్చింది.

నేను 1999లో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాను చూసినప్పుడు బాల్కని నుండి నేల టికెట్‌ వరకు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం చూశాను. ఆ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకులు అలా నవ్వడం ప్రత్యక్షంగా చూశాను. ఫ్యామిలీలోని అన్ని ఎజ్‌ గ్రూపులవాళ్లు నవ్వుతున్నారు. ఆ సినిమా చేయడానికి ఓ గౌరవంగా భావిస్తున్నాను. ప్రేక్షకుల మీద మరింత గౌరవం పెరిగింది. నేను చేసిన ప్రతి సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఎఫ్‌2 సినిమాను ఏకంగా వాళ్లింట్లో పెట్టుకున్నారు. ఎఫ్‌ 2 ఇచ్చిన బ్యాంగ్‌ ఒకటి కాదు. ఆ సినిమా ఇండియన్‌ పనోరమకు సెలక్ట్‌ అయ్యింది. ఈ ఇంటర్నేషనల్‌ అవార్డుల్లో బెస్ట్‌ మూవీగా ‘ఎఫ్‌2’కి, బెస్ట్‌ డైరెక్టర్‌గా నాకు అవార్డును సాధించింది. ఈ సినిమా తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుగారితో ‘సరిలేరు నీకెవ్వరు ‘సినిమా చేసే అవకాశం రావడం ఇంకా పెద్ద కిక్‌ ఇచ్చింది. అలాగే ‘ఎఫ్‌2’ సినిమా నన్ను డైరెక్టర్‌గా నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లిన గేమ్‌ ఛేంజర్‌.

ఈ సినిమా చేసే సమయంలో ‘మీరు చేసిన సినిమాలన్నింటిలో ‘ఎఫ్‌2′ సినిమానే ఎక్కువ లాభాలను తెచ్చిపెడు తుంది సార్‌’ అని దిల్‌రాజుగారితో సరదాగా చెప్పేవాడిని. నిజంగా సినిమా విడుదలైన తర్వాత దిల్‌రాజుగారు స్టేజ్‌ పై మాట్లాడుతూ మా ఎస్‌వీసీ బ్యానర్‌లోనే ‘ఎఫ్‌2’ సినిమా బిగ్గెస్ట్‌ ఫ్రాఫిటబుల్‌ మూవీ అని అనౌన్స్‌ చేశారు. అంత పెద్ద ప్రాఫిట్స్‌ నా నిర్మాతకు వస్తే డైరెక్టర్‌గా నాకంత కంటే ఆనందమేముంది. ఈ సినిమా సమయంలో వెంకటేశ్‌గారితో జర్నీ చేయడం.. నా అదష్టం. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ వచ్చాను. తర్వాత ఆయన్ని డైరెక్ట్‌ చేయడం ఓ ఫ్యాన్‌ బాయ్‌ మూమెంట్‌గా అనిపించింది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పది సినిమాలైనా చేస్తాను. అంత కంఫర్టబుల్‌ హీరో. చాలా స్వీట్‌ పర్సన్‌. జెన్యూన్‌ హీరో. వరుణ్‌తేజ్‌ కూడా అంతే కంఫర్ట్‌గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ హీరో. ఓ ఎమోషనల్‌ జర్నీ.

నెక్ట్స్‌ మూవీ ఎఫ్‌ 3 ఎప్పుడు చేయబోతున్నారు?
– ఎఫ్‌ 3 కోసం డిసెంబర్‌ 14 నుండి షెడ్యూల్‌ను దిల్‌రాజుగారు ప్లాన్‌ చేసుకున్నారు. ఎఫ్‌ 2 సినిమాను ఎంత మంది ప్రేక్షకులు తమదిగా భావించారో నాకు తెలుసు. ఇప్పుడు ఈ ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌కు మరో ఎఫ్‌ యాడ్‌ అవుతుంది. గెట్‌ రెడీ ఫర్‌ మోర్‌ ఫన్‌. ఈ కరోనా స్ట్రెస్‌ తర్వాత మనస్ఫూర్తిగా మిమ్మల్ని నవ్వించడానికి వస్తున్నాం. కరోనాకు వ్యాక్సిన్‌ వస్తుందో రాదో కానీ.. కచ్చితంగా ఎఫ్‌ 3తో ప్రేక్షకులకు నవ్వుల వ్యాక్సిన్‌ వస్తుందని గ్యారంటీ ఇవ్వగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here