Jr NTR War 2 Shooting update, Hrithik Roshan and NTR Wat 2 Pre Production details, War 2 Shooting start date, Director Ayan Mukerji Met Ntr In Hyderabad For War 2 Shooting
బాలీవుడ్ హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న మూవీ వార్ 2 ఈ సినిమా ప్రకటన రాంగానే సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ లో ఆర్ఆర్ఆర్ వంటి సినిమా తర్వాత డైరెక్ట్ గా బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అప్డేట్ గురించి ఫాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తూనే ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా కొరటాల అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్నారు. పూర్తిగా ఆక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా ఫాన్స్ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అయితే ఈ సినిమా షూటింగు నవంబర్ కల్లా పూర్తి అవుతుందని ఆ తర్వాత వార్ 2 సంబంధించిన షూటింగ్లో పాల్గొంటారని జూనియర్ ఎన్టీఆర్ సమాచారమైతే అందుతుంది.
అయితే దర్శకుడు అయాన్ ముఖర్జీ నిన్న హైదరాబాదులో జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ కార్యక్రమాల గురించి చర్చించినట్టు తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే అయన్ ముఖర్జీ ఇది మొదటిసారి కాదు జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం.. నాలుగవసారి కలిసిన ఐ ఎన్ ముఖర్జీ ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయో ఎన్టీఆర్కి వివరించడం జరిగిందంట.. దీనితోపాటు వార్ 2 షూటింగ్ సంబంధించిన చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది.
ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాంగానే ఈ సంవత్సరం నవంబర్ నుండే షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారమైతే అందుతుంది అయితే దేవర షూటింగ్లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి పాల్గొంటారని తెలుస్తుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రానికి సీక్వెల్‍గా వార్ 2 మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ రూల్స్ చేస్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది అయినా ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది.
2019లో విడుదలైన వార్ సినిమా 150 కోట్ల బడ్జెట్తో నిర్మించిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 450 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. మరి ఈసారి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్న కారణంగా ఇటు టాలీవుడ్ లోనూ భారీ అంచనాలను ఉండటంతో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.