బాలకృష్ణ #NBK107 సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ..!

0
2800
director Gopichand clarifies on Balakrishna #NBK107 movie title

Balakrishna #NBK107 : నటసింహం బాలయ్య తన స్థాయి హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయే మాస్ సినిమా ఎప్పుడు వస్తుందా అని, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ మూవీ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘క్రాక్’ గ్రాండ్ సక్సెస్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన మలినేని గోపీచంద్… నందమూరి బాలకృష్ణ సినిమా కోసం తానే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను తయారు చేసుకున్నారు.

బాలయ్యతో గోపీచంద్ చేసే చిత్ర కథపై ఇప్పటికే కొన్ని కథనాలు తెరపైకి వచ్చాయి. అలాగే ఈ మూవీకి రౌడీయిజం అనే టైటిల్ అనుకుంటున్నారని, ఈ టైటిల్ ని బోయపాటి ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారనేది టాక్. కానీ దానిని దర్శకుడు మలినేని గోపీచంద్ త్రోసిపుచ్చారు. అంతేకాదు… ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

director Gopichand clarifies on Balakrishna #NBK107 movie title

‘టైటిల్ విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. సినిమా టైటిల్ విషయంలో రేకెత్తుతున్న ఈ ఆసక్తి, ఉత్సుకత ఆనందాన్ని కలిగిస్తోంది. సరైన సమయంలో ఈ కథకు తగిన పేరును, ఇతర వివరాలను తప్పకుండా తెలియచేస్తాం” అని అన్నారు.