నెట్‌ఫ్లిక్స్ తో వివాదం పై క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్

0
313
నెట్‌ఫ్లిక్స్ తో వివాదం పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్
నెట్‌ఫ్లిక్స్ తో వివాదం పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్

Director Gunasekhar: టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన గుణశేఖర్ ఆతరవాత అంతగా మెప్పించలేక పోయాడు. సరైన సక్సెస్ కోసం గుణశేఖర్ చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో  రుద్రమదేవి సినిమాను తెరకెక్కించిన హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో గోనగన్న రెడ్డిగా అల్లుఅర్జున్ ఆకట్టుకున్నాడు. తాజాగా గుణశేఖర్ పాన్ ఇండియా మూవీగా `హిరణ్య కశ్యప` అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రానా హీరోగా నటిస్తున్నాడు.

అయితే గుణశేఖర్ కు ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ కి మధ్య వివాదం తలెత్తిందని ప్రచారం జరుగుతోంది.హిరణ్య కశ్యప సినిమా కంటే ముందు గుణశేఖర్ ఓ వెబ్ సిరీస్ తియ్యాలని అనుకున్నారని , ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారట. ఈ కథను నెట్ ఫ్లిక్స్ ను పంపగా వారు రిజక్స్ట్ చేశారని రూమర్స్  పుట్టుకొచ్చాయి. దీనిపై తాజాగా గుణశేఖర్ స్పందించారు. తను నెట్ ఫ్లిక్స్ తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని అసలు తనకు వెబ్ సిరీస్ లు చేయాలన్న ఆలోచనే లేదని.. రూమర్లని నమ్మొద్దని స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలో ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. హాట్ అప్డేట్ కోసం వేచిఉండండి అని వెల్లడించారు.

Previous articleడైహార్డ్ ఫ్యాన్‌ని సర్ ప్రైజ్ చేసిన బన్నీ
Next articleFamily audience are loving Anushka’s Nishabdham