త‌ప్పుడు వార్త‌లు రాసే వారికి హరీష్ శంకర్ షాకింగ్ ట్వీట్..!

0
345
Director Harish Shankar Shocking Tweets On Media on Sai Dharam Tej Bike Accident

Harish Shankar, Sai Dharam Tej: సాయి ధ‌ర‌మ్ తేజ్ శుక్ర‌వారం హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడిన సంగ‌తి తెలిసిందే . తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఇష్యూలో కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ నెట్టింట రచ్చ చేస్తోంది.

ఈ ప్ర‌మాదంలో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలు కావ‌డంతో వెంట‌నే అప‌స్మార‌క స్థితికి వెళ్లారు. ప్ర‌స్తుతం అత‌నికి అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, ఆరోగ్యం నిల‌క‌డగానే ఉంద‌ని అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని దర్శకుడు హరీశ్ శంకర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

“హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్.. హ్యాట్సాఫ్ సాయి తేజ్ అని అన్నారు. నీ ఆక్సిడెంట్ వంకతో.. తప్పుడు వార్తలు అమ్ముకొని, బతికేస్తున్న అందరు బాగుండాలి, వాళ్లకు ఆ అన్నం అరగాలి.” అని పేర్కొంటూ హరీష్ ట్వీట్ పెట్టడం సంచలనంగా మారింది.

Director Harish Shankar Shocking Tweets On Media on Sai Dharam Tej Bike Accident

ఇకపోతే హరీష్ చేసిన ఈ ట్వీట్ చూసి ఓ ప్రముఖ మీడియా జర్నలిస్ట్ స్పందిస్తూ.. ”మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. తప్పుడు కథలు, కథనాలు, హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించుకోవచ్చు కానీ తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు. అతి వేగంతో వెళ్లి మీరు ప్రమాదానికి గురికావడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు” అని ట్వీట్ చేశారు.

Director Harish Shankar Shocking Tweets On Media on Sai Dharam Tej Bike Accident

దీంతో ఈ ట్వీట్‌పై కూడా అంతేఘాటుగా రియాక్ట్ అయ్యారు హరీష్. ”నేను తప్పుడు వార్తలు అని క్లియర్‌గా మెన్షన్ చేశాను కదా.. మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు. అంటే ఒప్పుకున్నట్టేనా? క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు” అంటూ మరో షాకిచ్చారు.

మంచు ల‌క్ష్మీ, శ్రీకాంత్, బండ్ల గ‌ణేష్ వంటి ప్ర‌ముఖులు కూడా సాయి తేజ్‌పై త‌ప్పుడు ప్ర‌చారాలు చేయోద్ద‌ని కోరారు. నిర‌క్ష్యం వ‌ల‌న జ‌రిగిన ప్ర‌మాదం కాద‌ని, కేవ‌లం ఇసుక వ‌ల‌న స్కిడ్ అయి కింద ప‌డ్డాడ‌ని అంటున్నారు.