యాంకర్ అనసూయ (Anasuya) అలాగే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మధ్య జరుగుతున్న గొడవ అందరికీ తెలిసినదే. ట్విట్టర్ వేదికగా అనసూయ టైం దొరికినప్పుడల్లా పరోక్షంగా విజయ్ దేవరకొండ మీద కామెంట్ చేస్తూనే ఉంటుంది. ఈమధ్య ఖుషి మొదటి సింగిల్ విడుదల చేయుటకు ప్రకటించిన పోస్టర్లో THE అని ఉండటంతో దానిపై కూడా అనసూయ కామెంట్ (Anasuya comment) చేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఈ కోళ్లు వారు జరగటంతో ఫ్యాన్స్ కూడా అనసూయ ట్విట్టర్ ఎకౌంటు మీద కూడా ఒక్కన్నేసి ఎప్పుడూ ఉంచుతారు.
అనసూయ (Anasuya) ఏదైనా ట్విట్ చేయగానే.. విజయ్ (Vijay Devarakonda) ఫాన్స్ అలాగే ఫాలోవర్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య గొడవలోకి డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కూడా తలపెట్టినట్టు తెలుస్తుంది. ఈరోజు విజయ్ దేవరకొండ బర్త్ డే కావడంతో, ఆరుసార్లు ‘THE’ అంటూ విజయ్ దేవరకొండపై హరీష్ శంకర్ (Harish Shankar) ట్వీట్ చేయటం జరిగింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కావాలనే చేశారా? తెలిసి వీళ్ళిద్దరి మధ్యలో తల పెట్టారా..? అంటూ కామెంట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ చూస్తుంటే నిజంగానే దర్శకుడు అనసూయని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
ఇంకోవైపు అనసూయ (Anasuya) కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మరో పోస్ట్ ని విడుదల చేయడం జరిగింది. “‘అదే.. ఇంతమందేంటి అని.. నా ఒక్కదాని కోసం..’ అని పేర్కొంటూ, ‘ఏమో బాబూ.. నాకీ పీఆర్ స్టంట్లు తెలీవు.. రావు.. అవసరంలేదు కూడా.. కానీయండి.. కానీయండి..’ అంంటూ ట్వీటేసింది అనసూయ.
అలాగే దీనితోపాటు ఇంకో ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది.. దానిలో “వంద మంది కలిసి చేసినా తప్పు తప్పే.. ఒక్కడు రైట్ చేసినా రైట్ అవుతుంది” అనే కొటేషన్ ఉంది. మరి ఈ వీళ్లిద్దరి మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఎప్పుడు ఆగుతుందో తెలియదు కానీ.. ఇద్దరి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపకుండా చేస్తున్నారు.
“ THE” Passion he has
“ THE “ temper he holds….
“ THE “ anger he controls ….
“ THE “ Stardom he achieved… makes him“ THE “ Vijayadevarakonda;
Wishing “THE” most deserved man of our generations @TheDeverakondaa a very happy Birthday in advance…
Rock on Man 🤗🤗 pic.twitter.com/pNKrbRG5KY
— Harish Shankar .S (@harish2you) May 8, 2023
Web Title: Director Harish Shankar Viral tweet on Vijay and Anasuya, Harish Shankar strong counter to Anasuya on Vijay Deverakonda birthday special, Anasuya, Vijay Devarakonda cold war..