చిరంజీవి , రామ్ చరణ్ నటించిన ఆచార్య’ సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతుండగా, కొద్దిరోజుల క్రితం ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇటీవల ఆచార్య ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో, కొరటాల శివ తన రాబోయే ప్రాజెక్ట్ NTR30 గురించి మాట్లాడారు.


ఈ సినిమా తర్వాత కొరటాల శివ అలాగే ఎన్టీఆర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథ గురించి చాలా రోమసు మనం రోజు చూస్తున్నాం. కొరటాల – తారక్ సినిమాలో రీసెంట్ పొలిటికల్ హీట్‌ను సినిమాలో చూపిస్తారని టాక్. అయితే ఇంటర్వ్యూ లో భాగంగా NTR30 స్టోరీ గురించి శివ మాట్లాడటం జరిగింది.
కొరటాల శివ మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద స్టోరీ అని అలాగే బయట ప్రచారంలో ఉన్న రూమర్స్ ని నమ్మవద్దని తెలియజేశారు. అలాగే యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున ఆ చిత్రంతో తెలుగు సినిమా పరిమితులను దాటబోతున్నట్లు వెల్లడించాడు.


అంతేకాదు ఇప్పటివరకు తారక్‌ను చూడని పాత్రలో చూపిస్తా అని కూడా చెప్పారు కొరటాల. తారక్‌తో చేయబోయే సినిమా నా కెరీర్‌లోనే రాసిన అతి పెద్ద కథ అని కొరటాల శివ చెప్పుకొచ్చారు. టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కమర్షియల్ మూవీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న కొరటాల శివ, పాన్-ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం కోసం కథను రూపొందించినట్లు దీంతో అర్థమవుతుంది.
అంతేకాదు కొరటాల శివ కూడా రాబోయే రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్‌లతో కలిసి పని చేస్తానని చెప్పడం జరిగింది ఈ ఈ ఇంటర్వ్యూలో.