సోషల్‌ మీడియాకు కొరటాల శివ గుడ్‌బై!

0
20
Director Koratala Siva goodbye to social media

Koratala Siva: దర్శకుడు కొరటాల శివ సోషల్‌ మీడియాకు గుడ్‌ బై చెప్పారు. రైటర్ గా పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన కొరటాల శివ, దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత అపజయాన్నే ఎరగలేదు. ఇప్పటి వరకూ సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు సంబంధించిన వివరాలు తెలియజేస్తుండేవారు. ఇకపై సోషల్‌ మీడియాకు దూరంగా ఉండబోతున్నా అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

‘‘నా సినిమాలు, నాకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నా. ఇకపై సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా. మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటా. మీడియం మారింది కానీ మన మధ్య బంధంలో ఎలాంటి మార్పు ఉండదు’’ అని కొరటాల శివ పేర్కొన్నారు. 

అయితే… సోషల్ మీడియా నుండి కొరటాల శివ తప్పుకోవడానికి కారణం ఏమిటనేది మాత్రం తెలియచేయలేదు. ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని రూపొందిస్తున్న కొరటాల శివ… ఆ తర్వాత జూనియర్ ఎన్టీయార్ తో మూవీ చేయబోతున్నారు.