‘ఆచార్య’ కాపీ వివాదం.. కోర్టుకి వెళ్తున్న కొరటాల..!

0
313
director koratala siva reaction on acharya copy allegations

ఆచార్య సినిమా కథ కాపీ అంటూ నడుస్తున్న వివాదంపై ఎట్టకేలకు ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ స్పందించాడు. ఓ న్యూస్ ఛానెల్ తో లైవ్ లో మాట్లాడిన కొరటాల.. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ రాజేష్ అనే వ్యక్తితో నేరుగా ఛానెల్ లో మాట్లాడి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు కొరటాల.

‘నీకో దండం మహా ప్రభో.. ఆచార్య కథ నువ్ అనుకున్నది.. ఊహించుకుంటున్నది కాదు.. అసలు ఆ బ్యాక్ డ్రాప్ కానేకాదు.. తండ్రీ కొడుకులు ఉండరు.. దేవాదాయశాఖకి నిధులకు సంబంధించినది కానే కాదు..నీ పిచ్చి మాటలు చూస్తే ఎవరికైనా అనుమానం వచ్చేది.. కావాలంటే రాసిఇస్తా.. ప్రపంచం ముందు చెప్తున్నా’ తన సినిమాలో లేవని స్పష్టంచేశాడు కొరటాల.

‘ఆచార్య కథ ఇప్పటికే రిజిష్టర్ అయ్యిందని.. కథను మార్చే ఛాన్స్ లేదని రాజేష్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నాడని.. ఈ ఇష్యూని చిరంజీవి గారి దృష్టికి తీసుకుని వెళ్తానని.. ఇంతవరకూ వచ్చింది కాబట్టి కోర్టుకి వెళ్లి లీగల్‌గా యాక్షన్ తీసుకుంటా అంటూ ఆవేశంగా మాట్లాడిన కొరటాల.. యువ దర్శకుడు రాజేష్‌ని బ్లేమ్ చేయొద్దని హెచ్చరించారు. రాజేష్ చెబుతున్న కథకు, తను తీస్తున్న ఆచార్య కథకు ఎలాంటి సంబంధం లేదని.. టీవీ ఛానెల్ వేదికగా ఆన్-రికార్డ్ చెబుతున్నానని.. ఇంతకంటే హామీ ఇంకేం కావాలి అని ప్రశ్నిస్తున్నాడు కొరటాల.

అయితే రాజేష్ మాత్రం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. కొరటాల కో డైరెక్టరే నాకు ఈ విషయం చెప్పారు.. ఫస్ట్ లుక్ బ్యాక్ డ్రాప్ కూడా నేను రాసిన కథలోదే అంటూ వాదించారు. తనది ఒరిజినల్ స్టోరీ అని, రాజేష్ రాసుకున్న కథతో సంబంధం లేదని పదేపదే చెబుతున్నప్పటికీ రాజేష్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదన్నాడు కొరటాల.

Previous articleTelugu Bigg Boss 4 To Start From This Date?
Next articleసత్యదేవ్, తమన్నా జంటగా ‘గుర్తుందా శీతాకాలం’ ప్రారంభం