40 రోజుల్లో అంతా పూర్తి చేసిన క్రిష్..

0
459
Director Krish Jagarlamudi completed Vaishnav Tej movie shooting in just 40 days

Vaishnav Tej Krish movie: టాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేయగలిగే మొనగాడిగా పూరి జగన్నాథ్ కి పేరుంది. ఆయన శైలి స్పీడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. పెద్ద హీరోలతో అయితే మరో అనుమానం లేకుండా ఏడాది పట్టాల్సిందే. ఎందుకంటే అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ కోసమే ఆర్నెళ్లు తీసుకుంటున్నారు దర్శకులు. అందుకు భిన్నంగా పూరి జగన్నాథ్ చకచకా సినిమాలు తీసి రిలీజ్ చేసేస్తుంటారు. ఆయన స్పీడ్ ఇస్మార్ట్ స్పీడ్ అని పొగిడేస్తుంటారు సాటి దర్శకులు. కానీ ఇలాంటి సమయంలో కూడా క్రిష్ లాంటి దర్శకులు మాత్రం దుమ్ము దులిపేస్తున్నారు.

ఆయన ఇంతకుముందు గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి కాంప్లికేటెడ్ టాపిక్ ని హిస్టారికల్ కథాంశాన్ని అద్భుతంగా తెరకెక్కించి అది కూడా పరిమిత బడ్జెట్ లో 80 రోజుల్లోనే సినిమా ని పూర్తి చేసి శభాష్ అనిపించారు. తాజాగా ఈయన వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసాడు క్రిష్. మొత్తం టాకీ భాగం కేవలం 35 రోజుల్లో పూర్తి చేసేయగా.. ఒక పాట మాత్రమే పెండింగ్. ఐదు రోజుల్లో దీని చిత్రీకరణ పూర్తవుతుందని తెలుస్తోంది.

వైష్ణవ్ తేజ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. తన సొంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు క్రిష్. సినిమా అంతా వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. క్వాలిటీ పరంగానూ ఎక్కడా రాజీకి రాకుండా ఈ మూవీని పూర్తి చేసారని తెలుస్తోంది.

Previous articleA Thrilling Update From Ram Pothineni Movie Red Tomorrow
Next articleషూటింగ్ పూర్తిచేసుకున్న సుశాంత్ ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు..!!