Director Krish New Movie: టాలీవుడ్ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్శకుడు క్రిష్, గత మూడేళ్లుగా పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హరి హర వీర మల్లు నిర్మాణంలో ఉండి పోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయపరంగా కొంచెం బిజీ కావటంతో ఈ సింహాసనం సంబంధించిన షూటింగు డిలే అయింది. దానితోపాటు కోవిడ్ కూడా ఈ ప్రాజెక్టు లేట్ అవ్వటానికి కారణాలు ఉన్నాయి.
Director Krish New Movie: ప్రస్తుతం హరి హర వీర మల్లు సినిమాకు సంబంధించిన షూటింగ్ ని పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ ప్రకారం తిరిగి ప్రారంభిస్తామంటూ నిర్మాత ఏం రత్నం రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక దీనితో క్రిష్ కొత్త సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని ఈ సంవత్సరం చివరిలో షూటింగ్ కి వెళ్లాలని ప్లాన్ చేసినట్టు సమాచారమైతే తెలుస్తుంది.
ప్రభావవంతమైన మరియు ఆలోచింపజేసే చిత్రాలను రూపొందించడంలో ఖ్యాతి గడించిన క్రిష్ ఈ సినిమా కోసం ఒక యంగ్ హీరోతో చేయాలని అలాగే బడ్జెట్ వరంగా మరియు సమయం ఎక్కువ తీసుకోకుండా, క్రిష్ సినిమాను కొన్ని నెలల్లో పూర్తి చేసి, 2024 ప్రారంభంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే హరిహర వీర మల్లు షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది ఫిలింనగర్ లో టాక్ అయితే వినపడుతుంది. అప్పటి వరకు, అందరి దృష్టి క్రిష్ రాబోయే సినిమాపై ఉండగా.. చెయ్యబోయే సినిమా కోసం ఏ నటుడిని ఎంపిక చేసుకుంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి క్రిష్ అలాంటి సినిమాతో రాబోతున్నారనేది మరి కొన్ని రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి.