కొత్త సినిమా పేరు ప్రకటించిన కృష్ణవంశీ

292
Director Krishna Vamsi Announces New Movie Annam

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ సినిమా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో బుల్లితెర బ్యూటీ అనసూయ ప్రత్యేక గీతంలో నటిస్తుండగా..

 

 

ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా తాజాగా దర్శకుడు కృష్ణవంశీ తన తదుపరి సినిమాని ప్రకటించారు. నేడు మహాశివరాత్రి సందర్భంగా నూతన సినిమా ‘అన్నం’ పోస్టర్ విడుదల చేశారు. పరబ్రహ్మ స్వరూపం ట్యాగ్ లైన్ గా జోడించారు.

 

 

కాగా ఈ పోస్టర్ చూస్తూనే కృష్ణవంశీ మేకింగ్ స్టైల్ కనిపిస్తుంది. అరిటాకులో ‘అన్నం’ పై ఎర్రటి అక్షింతలు, రక్తంతో తడిసిన కొడవలి, ఓ మహిళ తాళిబొట్టుతో పోస్టర్ లో చూపించేశాడు. టైటిల్ లో ఉన్నంత సాఫ్ట్, సినిమాలో ఉండబోదని దర్శకుడు హింట్ ఇచ్చేశారు. పోస్టర్ బట్టి చూస్తుంటే ఈ సినిమాలో కాస్త రక్తపాతం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.