ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మారుతి..!

455

ప్రతి రోజూ పండగే సినిమా ద్వారా మళ్లీ సక్సెస్ ట్రాక్ ను ఎక్కాడు దర్శకుడు మారుతి. నాచురల్ స్టార్ నానితో లేదంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.

నాని, మారుతి కాంబినేషన్లో ఇప్పటికే ‘భలే భలే మగాడివోయ్’ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ హిట్ ను అందుకుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతుందనీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అంటున్నారు. మరో వైపు రామ్ కోసం మారుతి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తయారు చేస్తున్నట్లు.. ‘ప్రతిరోజూ పండగే’ లాగా ఈ సినిమాలో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తగ్గకూడదని ఇప్పటికే టీమ్ భావిస్తోందంటూ వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై మారుతి స్పందించారు.. “నా తదుపరి సినిమా పట్ల ఆసక్తిని కనబరుస్తున్నందుకు ఆనందంగా వుంది. అయితే నాని హీరోగా సినిమా చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇంకా నేను స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలోనే వున్నాను. అది పూర్తయిన తరువాత, అందుకు సంబంధించిన వివరాలను నేనే స్వయంగా చెబుతాను” అన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే మారుతి స్క్రిప్ట్ వర్క్ పూర్తీ అవ్వక ముందే మీడియాలో హీరోను కూడా సెలెక్ట్ చేసేశారన్న వార్త వచ్చేసిందన్న మాట..!