ఒకే డైరెక్టర్.. ఇద్దరు హీరోల పేర్లు.. ఏంటి ఈ కన్ఫ్యూజన్..?

287

Maruthi Next Movie Update: ప్రతి రోజూ పండగే సినిమా ద్వారా సక్సెస్ ట్రాక్ ను ఎక్కాడు దర్శకుడు మారుతి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీసే ఈ దర్శకుడి తర్వాతి సినిమా గురించి పలు చర్చలు నడుస్తూ ఉన్నాయి. నాచురల్ స్టార్ నానితో లేదంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట.

నాని, మారుతి కాంబినేషన్లో ఇప్పటికే ‘భలే భలే మగాడివోయ్’ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ హిట్ ను అందుకుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతుందనీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అంటున్నారు.

మరో వైపు రామ్ కోసం మారుతి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తయారు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ‘ప్రతిరోజూ పండగే’ లాగా ఈ సినిమాలో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తగ్గకూడదని ఇప్పటికే టీమ్ భావిస్తోందట. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. హీరోయిన్, ముఖ్య తారాగణంకు సంబంధించిన సమాచారం అతి త్వరలో తెలియజేయనుంది చిత్ర యూనిట్. ఒకే డైరెక్టర్.. ఇద్దరు హీరోల పేర్లు వినపడుతున్న ఈ తరుణంలో మారుతి ఏ హీరోతో సినిమా ఓకే చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.