Homeసినిమా వార్తలుప్రభాస్ పెళ్లి తో ముడిపడిన ఎన్నో టాలీవుడ్ పెళ్లిళ్లు.!!

ప్రభాస్ పెళ్లి తో ముడిపడిన ఎన్నో టాలీవుడ్ పెళ్లిళ్లు.!!

Director Nandini Reddy comments on Prabhas Marriage, Salaar, Project K, Adipurush, Prabhas wedding details, Prabhas latest news, Prabhas new movies, Prabhas, Prabhas upcoming movies,

Tollywood Hero’s waiting for Prabhas Marriage: తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అన్న వెంటనే గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. ఏజ్ బార్ బ్రహ్మచారులు ఎందరో టాలీవుడ్ లో ఉన్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం ఎవరికీ లేదు. డార్లింగ్ పెళ్లి ఎప్పుడు అనేది ఓ పెద్ద సెన్సేషనల్ టాపిక్. అటు బాలీవుడ్ లో సల్మాన్ ఇటు సౌత్ లో డార్లింగ్. ఇద్దరి పెళ్లిళ్ల టాపిక్ ఎప్పుడు ఏదో ఒక రూపంలో చర్చకు వస్తూనే ఉంటుంది.

Tollywood Hero’s waiting for Prabhas Marriage: చాలా సందర్భాలలో కలిసి పని చేసిన ప్రతి హీరోయిన్ తో ప్రభాస్ కి పెళ్లి అన్న గాసిప్ కూడా వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు భీమవరంలో ఓ అమ్మాయితో పెద్దలు కుదిరిచిన పెళ్లి అని మరికొన్నిసార్లు టాలీవుడ్ లో ఫలానా హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ అని సోషల్ మీడియాలో నిత్యం ఎప్పుడూ ఏదో ఒక కథనాలు వెలువడుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డార్లింగ్ ఫాన్స్ వాటిని వైరల్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు.

అయితే తాజాగా మహిళా డైరెక్టర్ అయిన నందిని రెడ్డి (Nandini Reddy Marriage) పెళ్లి టాపిక్ ఇంటర్వ్యూలో చర్చకు వచ్చినప్పుడు ఆమె ప్రభాస్ (Prabhas) పై ఇచ్చిన స్టేట్మెంట్ ప్రస్తుతం తిరిగి వైరల్ అయింది. అప్పుడెప్పుడో శర్వానంద్ (Sharwanand) కూడా నీ పెళ్లి ఎప్పుడు అంటే ఇంచుమించు ఇదే టైపు డైలాగ్ వేశాడు. నేరుగా నందిని తన పెళ్లి ఎప్పుడు అనేది చెప్పకుండా ముందుగా సల్మాన్ ఖాన్ పేరు చెప్పి…ఆయన చేసుకుంటే నేను చేసుకుంటాను.. అసలు అంత దూరం ఎందుకు మన ప్రభాస్ ఉన్నాడుగా.. ప్రభాస్ పెళ్లి (Prabhas Marriage) చేసుకున్నాక నేను చేసుకుంటాను అని చమత్కరించారు.

Director Nandini Reddy comments on Prabhas Marriage

ఎంకిపెల్లి సుభిచావుకు వచ్చిందని…పాపం ప్రభాస్ (Prabhas) ఎదో తన లైఫ్ తాను ఎంజాయ్ చేస్తుంటే మీకు పెళ్లెప్పుడు అని టాలీవుడ్ లో ఎవరిని అడిగినా ప్రభాస్ కి అయ్యాక అని ప్రతిదాంట్లో ప్రభాస్ ని లాగుతున్నారు. అలా మొదలైంది మూవీతో దర్శకురాలిగా తెలుగు తెరకు పరిచయమైన నందిని రెడ్డి.. జబర్దస్త్ ,కళ్యాణ వైభోగం, ఓ బేబీ లాంటి వైవిధ్యభరితమైన పలు చిత్రాలను తెరకెక్కించారు. కొత్తగా ఆమె డైరెక్షన్లో అన్నీ మంచి శకునములే అనే ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Web Title: Director Nandini Reddy comments on Prabhas Marriage, Salaar, Project K, Adipurush, Prabhas wedding details, Prabhas latest news, Prabhas new movies, Prabhas, Prabhas upcoming movies,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY