Homeట్రెండింగ్Adipurush Teaser ట్రోలింగ్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Adipurush Teaser ట్రోలింగ్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Prabhas Adipurush Teaser Trolling: ప్రభాస్ అప్డేట్స్ గురించి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆదిపురుష్ టీజర్ విడుదల చేసి ఒక ప్రభంజనాన్ని సృష్టించారు దర్శకుడు ఓం రౌత్. అయితే ఆదిపురుష్ టీజర్ విడుదల చేసిన దగ్గర్నుండి దీనిపై ట్రోల్స్ నడిచాయి. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో దర్శకుడు దీనిపై స్పందించడం జరిగింది.

ఆదిపురుష్ టీజర్ (Adipurush Teaser) మొత్తం విజువల్ గ్రాండ్ గా విడుదల చేయడం జరిగింది. లీడ్ క్యారెక్టర్స్ ను కార్టూన్ క్యారెక్టర్స్ మాదిరి చూపించారు అని కొంతమంది ఆదిపురుష్ టీజర్ (adipurush memes) పై ట్రోల్లింగ్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ‘Disappointed’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం జరిగింది.

వీటిపై ఆదిపురుష్ దర్శకుడు (Adipurush Director) ఓం రౌత్ మాట్లాడుతూ “ఆదిపురుష్ టీజర్ (Adipurush Teaser) యూట్యూబ్‌లో చూడటం ఖచ్చితంగా విభిన్నంగా కనిపిస్తుంది. ఈ చిత్రం వెండితెర కోసం రూపొందించబడింది. ఆదిపురుష్ టీజర్ ని ఫాన్స్ కోసం అలాగే బాగా ప్రమోట్ చేయడానికి మాత్రమే మేము దీన్ని చేసాము. ఈ చిత్రం వెండితెర కోసమే” అని చెప్పటం జరిగింది.

Om Raut defends 'Adipurush' against online trolling
Om Raut defends ‘Adipurush’ against online trolling

సినిమాలో వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ ఏంటని అందరూ ప్రశ్నిస్తున్న వేళ, సైఫ్ అలీఖాన్‌ని రావణుడిలా కాకుండా ఢిల్లీ సుల్తాన్‌గా చూపించిన తీరు, హనుమంతుడి వానర సైన్యం ‘ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్’ చిత్రాన్ని అనుకరిస్తూ తీసినట్టు కనిపిస్తున్న అప్పటికీ, యూట్యూబ్‌లో చూడటం నిజంగా అనుభవాన్ని చంపేస్తుంది అని వెండితెరపై అది గొప్పగా ఉంటుందని ఓం రౌత్ చెప్పుకొచ్చారు.

ఇంకా, ఓం రౌత్ ఈ టీజర్ దశాబ్దానికి ఒకసారి సినిమాలు చూసే వారి కోసం కాదు, థియేటర్లకు వెళ్లి రామాయణ కథను ప్రత్యక్షంగా అనుభవించాలనుకునే వారి కోసం రూపొందించబడింది అని చెప్పడం ద్వారా పెద్ద చర్చకు దారితీసింది. ఏది ఏమైనప్పటికీ, ఆదిపురుష్ దర్శకుడు తన వైపు నుండి క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఓం రౌత్ క్లారిటీ పై మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.  

Web title: director Om Raut clarity on Adipurush Teaser Trolling, Om Raut defends ‘Adipurush’ against online trolling..

Related Articles

Telugu Articles

Movie Articles