ఈడీ ముందు హాజరైన పూరీ జగన్నాథ్‌..!

0
140
Tollywood drug case Director Puri Jagannadh appears before ED

Tollywood Drug Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో మరోసారి ఉలిక్కిపడేలా చేస్తుంది. నాలుగేండ్ల గ్యాప్‌ తర్వాత ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌) మరోసారి టాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగా మంగళవారం అంటే ఈరోజు (Puri Jagannadh ) డైరెక్టర్‌ పూరీజగన్నాథ్‌ ఈడి విచారణకు హాజరయ్యారు. కుమారుడు ఆకాష్‌ పూరీతో ఈడీ కార్యాలయానికి వచ్చారు.

2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆయన్ను ఆరా తీస్తున్నట్లు సమాచారం. పూరీ ఉదయం 10.30 గంటలకు హాజరు కావాల్సి ఉండగా.. 10.05 గంటలకే వచ్చారు. ఈ సందర్భంగా మీడియా మాట్లాడాలనీ ప్రయత్నించింది.

అయితే పూరీ జగన్నాథ్ మాత్రం స్పందించలేదు. ఈ విచారణ ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా కొనసాగనుంది. మనీలాండరింగ్‌ కోణంలోనే వివరాలు సేకరించనున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈడీ పూరీని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా విదేశీ బ్యాంక్‌ అకౌంట్లలో జమైన డబ్బు విషయంలో ప్రశ్నించనున్నారని సమాచారం.

Tollywood drug case Director Puri Jagannadh appears before ED

ఈ వ్యవహారంలో సెప్టెంబర్ 2వ తేదీన చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.

 

Previous article“టక్ జగదీష్” ట్రేండింగ్.. ట్రైలర్ కు ముహుర్తం ఖరారు..!
Next articleGopichand Seetimaarr Official Trailer