Sandeep Reddy Vanga Next Film Latest Updates
Sandeep Reddy Vanga Next Film Latest Updates

అర్జున్ రెడ్డి సినిమాతో పాత్ బ్రేకింగ్ హిట్ అందుకుని,మళ్ళీ అదే సినిమా రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సాలిడ్ దక్కించుకున్నాడు సందీప్ రెడ్డి వంగా.ఫస్ట్ డే యావరేజ్ టు నెగెటివ్ టాక్ తెచ్చుకున్న కబీర్ సింగ్ ఇప్పుడు మాత్రం ఆల్ టైం సూపర్ హిట్.వీక్ ఎండ్స్,వీక్ డేస్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ కుమ్మేస్తుంది.ఇప్పటికే 180 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ అయిన ఉరి ని టార్గెట్ చేసింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయిన సందీప్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ లేదు.సందీప్ కథకి మహేష్ ఓకే అనలేదు.సందీప్ అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి వాళ్ళు ఎదో ఒక హీరోతో సినిమా స్టార్ట్ చెయ్యమంటున్నారు.కానీ అతను మహేష్ తో మాత్రమే చేస్తా అన్ని పట్టుబట్టాడు.మరో పక్క బాలీవుడ్ నాడి పట్టుకున్న సందీప్ తో సల్మాన్ ఖాన్ ప్రోజెక్ట్ సెట్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరి సందీప్ రెడ్డి నెక్స్ట్ ఏ సినిమా ఓకే చేస్తాడో,ఏ భాషలో చేస్తాడో,ఏ హీరోతో చేస్తాడో అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో అంతా నెక్స్ట్ ఏంటి? అని ఈ హిట్ డైరెక్టర్ వైపు చూస్తున్నారు.పరిస్థితి ని బట్టి విజయ్ తో మైత్రి వాళ్ళ సినిమా చెయ్యాలి అనే ఆలోచనలో కూడా ఉన్నాడట.

[INSERT_ELEMENTOR id=”3574″]