Director Sexual harassment on lady art director at road side
Director Sexual harassment on lady art director at road side

టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో ‘మీటూ’ లాంటి ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా శ్రీ రెడ్డి ఆ ఉద్యమాన్ని కొద్ది రోజుల పాటు పెద్ద స్థాయిలో తీసుకొని వెళ్లారు. కానీ అనుకోకుండా ఆ ఉద్యమం కాస్తా వివాదంలా టర్న్ తీసుకుంది. ఉద్యమం సమయంలో కొందరు బడా బడా ఫ్యామిలీలకు చెందిన వారి పేర్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు..! ప్రతి ఒక్క హీరోయిన్ ను కూడా మీకు అలాంటి ఘటనలు ఎదురయ్యాయా మేడమ్ అంటూ ప్రశ్నించడమే ఆనవాయితీగా పెట్టుకున్నారు కొందరు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇందులో కల్పించుకుని.. ఓ కమిటీని కూడా వేసింది. ఆ తర్వాత పరిస్థితులు కాస్త చక్కబడ్డట్టే కనిపించాయి.

తెలుగు సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ యువతిని కొందరు నడిరోడ్డుపైనే ఎక్కడపడితే అక్కడ తాకాలని ప్రయత్నించారు. ఆ యువతితో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో తాను ప్రయాణిస్తున్న కారును మరోకారు ఢీకొట్టింది. ఢీ కొట్టిన కారులో ఉన్న వ్యక్తులను వివరణ ఇవ్వాలని కోరగా.. అందులో ఉన్న మహిళలు, యువకులు కలిసి అసభ్య పదజాలంతో తిడుతూ.. ఆమెపై దాడికి దిగారట..! అంతేకాకుండా తన దుస్తులు కూడా చింపడానికి ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో పోలీసులకు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో నిజా నిజాలు తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆమెను అలా తాకడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఎవరా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. దిశ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఇలాంటి ఘటన జరగడంతో హాట్ టాపిక్ గా మారింది.