Director Shankar Compromise On Bharateeyudu 2 Budget
Director Shankar Compromise On Bharateeyudu 2 Budget

సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న శంకర్ కి ఈ మధ్య టఫ్ టైం నడుస్తుంది.అతని సినిమాలు టెక్నికల్ గా పేరు పెట్టడానికి లేకపోయినా,కథా కథనాల విషయంలో మాత్రం గతంలో ఉన్నంత షార్ప్ గా ఉండట్లేదు అని ఐ,2.0 సినిమాల ఫలితాలు నిరూపించాయి.అందుకే తనకి దేశవ్యాప్తంగా పేరు తెచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ స్టార్ట్ చేసాడు శంకర్.కానీ 2.0 రిజల్ట్ శంకర్ మీద ప్రొడ్యూసర్స్ కాన్ఫిడెన్స్ ని హరించేసింది.దాంతో లిమిటెడ్ బడ్జెట్ లో భారతీయుడు-2 తియ్యాలి అనే ప్రొపోజల్ శంకర్ ముందుకు వచ్చింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

తన మొదటి సినిమా నుండి కూడా బడ్జెట్ రిస్క్ట్రిక్షన్స్ మధ్య సినిమా తియ్యడం అలవాటు లేని శంకర్ నో చెప్పాడు.లైకా నుండి భారతీయుడిని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసాడు.కానీ శంకర్ ప్రస్తుత ఫామ్ ని దృష్టిలో ఉంచుకుని అతని అడిగిన అన్ లిమిటెడ్ బడ్జెట్ పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.దాంతో మళ్ళీ లైకా తో కలిసి భారతీయుడు-2 ని ముందుకు తీసుకెళుతున్నాడు.తన కెరీర్ లో ఫస్ట్ టైం కాంప్రమైజ్ అయ్యాడు.రెండు నిమిషాల సీన్ కి రెండు కోట్లతో గోల్డ్ సెట్ వేయించడంతో లైకా అధినేత శుభాస్కరన్ కంగారు పడి మేల్కొన్నాడు.

ఈ సినిమాలో హీరోగా కంటిన్యూ అవ్వడానికీ కమల్ రెడీ.కానీ ఇప్పటికే ఈ సినిమా నుండి తప్పుకున్న కాజల్ ని మళ్ళీ పిలుస్తారా? లేక వేరే ఎవరికయినా ఛాన్స్ ఇస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.భారతీయుడుని దాటేలా ఉంటే తప్ప భారతీయుడు-2 క్లీన్ హిట్ గా నిలవదు.శంకర్ కాస్త డీప్ గా ఆలోచించాల్సిన టైం వచ్చింది.

[INSERT_ELEMENTOR id=”3574″]