Khushi Movie Shooting Update: విజయ్ దేవరకొండ అలాగే సమంత కలిసి నటిస్తున్న సినిమా ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మొదటిసారిగా చేస్తున్న లవ్ ఎంటర్టైనర్ ఖుషి సినిమా. అయితే ఖుషి సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. ఈరోజు డైరెక్టర్ ఖుషి సినిమా షూటింగ్ గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది.
Khushi Movie Shooting Update: విజయ్ దేవరకొండ.. సమంత ఖుషి సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలోనూ అలాగే వెబ్ మీడియాలోనూ అనేకమైన ప్రచారాలు జరిగాయి. మొదటగా సమంత ఆరోగ్యం పరిస్థితి వలన షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత విజయ్ దేవరకొండ కూడా తన కొత్త సినిమా అనౌన్స్ చేసి దానిపై వర్క్ చేయడం జరుగుతుంది. దీనితో అందరూ కృషి సినిమా ఆగిపోయిందని అనుకున్నారు.
సోషల్ మీడియాలోనూ అలాగే వెబ్ మీడియాలో వస్తున్న ప్రచారాలను కొట్టివేస్తూ ఖుషి దర్శకుడు శివ నిర్వాణ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం జరిగింది. శివ నిర్వాణ ట్విట్టర్ అకౌంట్ లో ఇలా రాయటం జరిగింది “ఖుషి సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని.. అంతా చాలా బాగా బాగుందని” తెలియజేశారు.
దీంతో విజయ్ దేవరకొండ అలాగే సమంత ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.. సినిమాపై ఎవరు అప్డేట్ ఇవ్వకపోవడంతో సినిమా ఆగిపోయిందని చాలామంది అభిప్రాయానికి వచ్చారు కానీ దర్శకుడు ఒక్కసారిగా అప్డేట్ ఇవ్వటంతో అందరూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ట్రెండ్ చేస్తున్నారు.