Latest Posts

రామ్ చరణ్ – శౌర్యువ్ కాంబినేషన్లో మూవీ.. నిజమేనా..?

- Advertisement -

Ram Charan – Director Shouryuv Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

ఇక RC16 తర్వాత చరణ్ (Ram Charan) తన తర్వాతి సినిమాను ఎవరూ ఊహించని దర్శకుడితో చేయబోతున్నాడనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, హాయ్ నాన్న సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శౌర్యువ్, (Shouryuv) రామ్ చరణ్‌కు ఓ స్టోరీలైన్ వినిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ కథ చరణ్‌కి నచ్చడంతో, శౌర్యువ్ స్క్రిప్ట్‌ను పూర్తిగా డెవలప్ చేయడం ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే, శౌర్యువ్ రామ్ చరణ్‌ను ఏ గెటప్‌లో, ఎలాంటి కథతో ప్రెజెంట్ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే వరకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles