Director Srinu Vaitla Shocking Comments on Anil Ravipudi
Director Srinu Vaitla Shocking Comments on Anil Ravipudi

పటాస్ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతూ… తన సినిమా వస్తుందంటే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగించిన దర్శకుడు అనిల్ రావిపూడి. తన సినిమాలతో బాక్సాఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేస్తూ… హీరోల ఖాతాల్లో బ్లాక్ బస్టర్ సినిమాలను జత చేస్తూ… అరే ఏముందిరా సినిమా అంటూ ప్రేక్షకులు అనుకునేంతలో ప్రభావితం చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

అయితే అనిల్ రావిపూడి దర్శకుడిగా మారకముందు స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో ఉంటూ కొన్ని సినిమాలకు పనిచేశాడు. ‘ఆగడు’ సినిమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్ల అడ్రస్ గల్లంతయింది. వరుస ప్లాపులతో టాప్ దర్శకుడిగా ఉన్న ఆయన పాతాళంలో పడిపోయారు. తాజాగా మహేష్ బాబు ఆగడు సినిమా గురించి అనిల్ రావిపూడి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆగడు సినిమాకి దర్శకుడు అనిల్ రావిపూడి స్కిప్ట్ వర్క్ చేశారు. ఫస్టాప్ పూర్తి చేశాక.. ఆయనకి పటాస్ ఆఫర్ రావడంతో.. సెకాంఢాఫ్ పూర్తి చేయకుండానే వెళ్లారట. దీంతో ఇప్పటికీ శ్రీనువైట్ల గారు ఎక్కడ కనిపించినా.. ఏంటయ్యా నాతో సెకండాఫ్ కూర్చోకుండానే వెళ్ళిపోయావ్ గా… నీ అంతు చూస్తా అంటూ ఉంటారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

నిజంగానే ఆగడు సినిమా సెకాంఢాప్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదేమోనని అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా గురించి ప్రతి వారం అప్డేట్స్ విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తుంది చిత్ర బృందం. అంతేకాకుండా ఈ సినిమాలో 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తూ ఓ ముఖ్య పాత్రలో నటించబోతోంది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ లో దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ కనిపిస్తుంది.