రాజమౌళి ప్రభాస్‌తో మళ్లీ సినిమానా..?

0
252
Director Ss Rajamouli Film Shocking Comments On Movie With Prabhas

ఎస్.ఎస్. రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు ‘ఛత్రపతి’ ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ చిత్రాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే. యంగ్ రెబల్‌స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రభాస్‌ను ఆలిండియా స్టార్‌ని చేసింది కచ్చితంగా రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలి, బాహుబలి-2 తర్వాత ప్రభాస్ రేంజ్ బాలీవుడ్ హీరోలను మించిపోయింది.

అందుకే దర్శక నిర్మాతలు ఆయనతో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఎలాగుంటుంది.? ఇదే ప్రశ్న రాజమౌళికి ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసా. ప్రభాస్ ని మరోసారి డైరెక్ట్ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ.. ”వామ్మో.. మళ్లీ ప్రభాస్ తోనా? బాహుబలి కోసం దాదాపు 5 సంవత్సరాలు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్ లో సినిమా అంటే జనాలు తలలు పట్టుకుంటారేమో” అని చెప్పుకొచ్చారు.

రాజమౌళి ఈ మాటలు మాటలు అన్న తర్వాత నవ్వుతూ ”సరదాగా అలా అన్నాను. నిజంగా ప్రభాస్ తో సినిమా చేయడం నాకు ఇష్టమే. మంచి కథ కుదిరితే తప్పకుండా మేం మళ్లీ సినిమా చేస్తాం” అని జక్కన్న చెప్పారు.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ఇటీవల ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్.ఆర్.ఆర్’ అనే పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here