director sukumar may ready to plan pushpa shooting in kerala forest

Allu Arjun Pushpa Shooting: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్‌ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. ఈ మూవీలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మొదటిసారిగా జత కట్టబోతోంది. జగపతి బాబు, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప షూాటింగ్‌కు సంబంధించి అప్‌డేట్ వచ్చింది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం కేరళ అడవుల్లోనే షూాటింగ్ చేసేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.

గంధపు చెక్కల స్మగ్లర్‌‌ పాత్ర కోసం ఆయన డిఫెరెంట్ మేకోవర్‌తో రెడీ అయ్యారు. కథ నేపథ్యంలో ఈ సినిమా అంతా అటవీ ప్రాంతంలోనే తెరకెక్కాల్సి ఉంది. ఇందుకోసం సుకుమార్ కేరళ అడవులను సెలక్ట్ చేసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.

దీంతో ఈ సినిమాను ఏపీలోని రంపచోడవరం, తెలంగాణలోని వికారాబాద్, మహబూబ్‌నగర్ అడవుల్లో తెరకెక్కించనున్నారంటూ కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కొట్టేసిన సుకుమార్‌ కేరళ అడవుల్లోనే షూటింగ్ జరుగుతుంది క్లారిటీ ఇచ్చారు. కేరళ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తే ప్రేక్షకులకు కొత్తదనం అందించినట్లు ఉంటుందని, బన్నీకి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో తమకు కలిసొస్తుందని యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో నవంబర్ మొదటి వారంలో కేరళ అడవుల్లో ఈ చిత్రం షూటింగును మొదలెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.