Director Teja comments on Rajamouli: డైరెక్టర్ తేజ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో టాప్ డైరెక్టర్ లిస్టులో ఉన్నారు. అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది కొత్త నటించిన పరిచయం చేయటం కూడా తన వంతు పాత్రను పోషించారు ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్ కావడంతో కొంత గ్యాప్ తీసుకుని తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాలని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన సినిమాల కంటే ఆ మాటలతో సోషల్ మీడియాలోనూ అలాగే వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి పై చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Director Teja comments on Rajamouli: దర్శకుడు తేజ చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రస్తుతం అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ (Abhiram Daggubati) హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అహింస (Ahimsa movie) సినిమాని షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్లో దర్శకుడు తేజ అలాగే మిగతా నటీనటులు బిజీ అవుతున్నారు. ఈ తరుణంలోనే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్ల మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు.
వివరాల్లోకి వెళితే, అహింస సినిమా కూడా అచ్చం జయం సినిమా లాగే ఉంది అంటూ యాంకర్ అడిగిన క్వశ్చన్ కి దర్శకుడు తేజ సమాధానమిస్తూ.. ఆ సినిమా నేనే తీశాను అలాగే ఈ సినిమా నేనే తీశాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది.. అలాగే రెండు సినిమాలు కి దర్శకుడు నేనే కాబట్టి ఆ రెండింటిలోనూ సిమిలారిటీస్ ఉంటాయని సమాధానం ఇచ్చారు..
అలాగే దీనితోపాటు.. తాను మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ దర్శకుడు అయినా తీసే సినిమాల్లో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయని చెప్పుకోవచ్చారు దానితోపాటు టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో రాజమౌళి (Rajamouli), గౌతమ్ మీనన్, వీవీ వినాయక్ అలాగే బోయపాటి పాటు ఏ ఇతర దర్శకులు కూడా ఇంటిలిజెన్స్ డైరెక్టర్లు కాదని కేవలం సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు మాత్రమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేయటం విశేషం.



తాను కూడా ఇంటిలిజెన్స్ డైరెక్టర్ కాదు అని.. ఒకవేళ ఇంటిలిజెంట్ డైరెక్టర్ అయితే అన్నీ సక్సెస్ లు ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఒకవేళ తాను వేస్ట్ డైరెక్టర్ని అయితే అన్నీ ఫ్లాప్లే తీయాలి కదా సక్సెస్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సినిమా విడుదలైన తర్వాత ఒక మ్యాజిక్ అనేది జరుగుతుందని దానివల్లే సినిమాలు సక్సెస్ అవుతున్నాయని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. తేజ చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Web Title: Director Teja comments on Rajamouli and other directors details, Teja comments on Rajamouli, Director Teja new movie Ahimsa release date, Abhiram Daggubati New movie, Abhiram Daggubati debut movie, Abhiram Daggubati Ahimsa movie details, Teja and Abhiram Daggubati new movie details,