Director Teja Comments On Prabhas: స్టార్ డైరెక్టర్ తేజ గురించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు. కొత్త హీరోలని అలాగే హీరోయిన్స్ ని తెలుగు ఇండస్ట్రీకి ఎక్కువ పరిచయం చేసిన వారిలో డైరెక్టర్ తేజ ముందు ఉంటారు. అలాగే కొత్త వారికి పక్కాగా హిట్ ఇవ్వటంలో తేజ మార్క్ ఎప్పుడూ ఉంటుంది. తేజ ప్రస్తుతం గోపీచంద్ (Gopichand) నటించిన రామబాణం (Ramabanam) సినిమా ప్రమోషన్ లో ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో ప్రభాస్ (Prabhas) మీద ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది.
Director Teja Comments On Prabhas: పీపుల్స్ మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న గోపీచంద్ రాబోయే సినిమా రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమాతో మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి గోపీచంద్ సిద్ధంగా ఉన్నారు. సినిమాపై మరింత హైప్ తీసుకురావడానికి రామబాణం టీ మొత్తం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగానే డైరెక్టర్ తేజ తో గోపీచంద్ ఇంటర్వ్యూ చేయటం జరిగింది. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో గోపీచంద్ (Gopichand) అలాగే డైరెక్టర్ తేజ (Teja) చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూ లో భాగంగానే తేజ ప్రభాస్ (Prabhas) మీద కామెంట్ (Comment) చేయడం జరిగింది. తను మాట్లాడుతూ అలాగే ప్రభాస్ తో ఉన్న రిలేషన్ గురించి చెబుతూ.. ప్రభాస్ 1000 రెట్లు మంచివాడని.. ఇండస్ట్రీలో తనకి ఎవరితో ఎటువంటి విభేదాలు లేవని.. అందుకనే ప్రభాస్ ని అందరూ అమితంగా ప్రేమిస్తారని చెప్పడం జరిగింది.. దీనితోపాటు అందరికీ గౌరవం ఇస్తారని.. గోపీచంద్ నాన్నగారి తర్వాత అంత మంచితనం ప్రభాస్ లోనే చూశానని దర్శకుడు తేజ చెప్పడం జరిగింది.

గోపీచంద్ తండ్రి గారు కూడా గతంలో ఇలాగే ఉండేవారని అందుకని ఆయన మీద ఎవరు ఎటువంటి కామెంట్ చేయటానికి ధైర్యం చేసేవారు కాదని చెప్పారు. అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ అని అలాగే దర్శకుడు విషయంలో టి.కృష్ణ ఉంటారని.. గోపీచంద్ తండ్రి మీద ఉన్న ప్రేమని బయటపెట్టారు దర్శకుడు తేజ.
తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాతోనే హీరో గోపీచంద్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అప్పట్లో ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ అలాగే డింపుల్ హయాతి నటించిన రామబాణం సినిమా 5 May 2023 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాతో మళ్లీ గోపీచంద్ హిట్ ట్రాక్ లోకి రావాలని అందరం ఆశిద్దాం..