Disco Raja Heroine Nabha Natesh Special Interview
Disco Raja Heroine Nabha Natesh Special Interview

(Disco Raja Heroine Nabha Natesh Special Interview) నన్ను దోచుకుందువటే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమై తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది కన్నడ సుందరి నభా నటేష్‌. గతేడాది రామ్‌తో కలిసి ఇస్మార్ట్‌ శంకర్‌లో సందడి చేసింది. గట్టి కమర్షి యల్‌ హిట్‌ కొట్టింది. ఇప్పుడు రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కోరాజాలో క్లాస్‌ అమ్మాయిగా అలరించబోతోంది. ఈ నెల 24న డిస్కోరాజా తెరపైకి వస్తోంది. ఈ సందర్భంగా నభా చెప్పిన సినిమా విశేషాలు చూస్తే..

గతేడాది నాకు బాగా కలిసొచ్చింది. ఇస్మార్ట్‌ శంకర్‌ లాంటి సూపర్‌హిట్‌ సినిమా అందుకున్నాను. నాకు మంచి గుర్తింపు దక్కింది. ఎక్కడికి వెళ్లినా ఆ సినిమాలోని పాటలు డైలాగులు చెప్పమని ప్రేక్షకులు కోరుతున్నారు. ఈ ఏడాది కూడా బాగా ఉంటుందనే ఆశిస్తున్నాను. డిస్కోరాజా కథ విన్నప్పుడు అద్భుతంగా ఉందని అనిపించింది. ఈ సినిమా రవితేజ గారితో ఎలా తెరకెక్కిస్తారో అని ఆలోచి స్తూ ఉండిపోయాను. మీతో పాటు నేను కూడా విడుదల రోజు కోసం వేచి చూస్తున్నా. నాకు చెప్పిన కథను దర్శకుడు ఎంత బాగా తెరకెక్కించాడో చూడాలని అనుకుంటున్నా.

ఈ చిత్రంలో వాహనాలకు లోన్స్‌ ఇచ్చే ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను. ఇస్మార్ట్‌ లో మాస్‌ పాత్ర చేస్తే.ఇందు లో దానికి పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌లో నటించాను. ఇతరుల కోసం ఆలోచిస్తుంటా, భావోద్వేగాలు నిండిన పాత్ర నాది. నా మొదటి సినిమా నుంచి నటించేందుకు వీలున్న పాత్రలు దక్కడం అదృష్టమే అనుకుంటున్నా.

ఏ సినిమాలోనూ పాటలకే పరిమితం కాలేదు. చాలా మంది నాయికలకు నటించేందుకు ఆస్కారం ఉండదు. రవితేజ గారి విక్రమార్కుడు, కిక్‌ సినిమాలు నాకు బాగా ఇష్టం. తెరపై ఆయన చూపించే ఉత్సాహం, శక్తి ఆకట్టుకుంటాయి.

ఆయనతో సినిమా అనగానే ఆనందం కలిగింది. ఒక స్టార్‌ హీరోతో నటించే అవకాశం దక్కిందనే సంతోషం కంటే ఎక్కువ ఆనందమది. సెట్స్‌లో ఆయన చాలా సరదాగా ఉంటారు. అనేక విషయాలు మాట్లాడుతుంటారు.

ఆయన తోటలో పండించే పండ్ల గురించి చెబుతుంటారు. దర్శకుడు వీఐ ఆనంద్‌ ప్రతి సినిమా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఈ సినిమాను కూడా ఆయన ఆశ్చర్యపోయేలా తెరకెక్కించారు.

మాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంగా డిస్కోరాజాను చెప్పుకోవచ్చు. నాకు సినిమాలంటే ఇష్టం. థియేటర్‌ ఆర్టిస్టుగా నట ప్రయాణం ప్రారంభించాను కాబట్టి నటిగా పరిపూర్ణత కోరుకుంటా. ప్రతి చిన్న సన్నివేశాన్నీ బాగా నటించాలి అనుకుంటా.

డిస్కో రాజాలో మరో నాయిక పాయల్‌తో కలిసి నటించే సన్నివేశాలు లేవు. తోటి నాయికలతో పోటీ అంటే ఉంటుంది. కానీ అది ఆరోగ్యకరమైన పోటీ. నాకు ఇక్కడ మిత్రులు తక్కువ. వీలు దొరికితే బెంగళూరు వెళ్తుంటారు. కన్నడ సినిమాల్లోనూ నటిస్తున్న. ఇక్కడ బెల్లంకొండ సాయితో ఒక సినిమా, సాయి తేజ్‌తో కలిసి సోలో బ్రతుకే సో బెటరూ చిత్రాల్లో నటిస్తున్నా.