Disco Raja Total WW Pre-Release Business
Disco Raja Total WW Pre-Release Business

(Disco Raja Total World Wide Pre-Release Business, Ravi teja Disco Raja box office collection)మాస్ మహారాజా రవితేజకు వరుసగా ఫ్లాపులొచ్చినా ట్రేడ్ వర్గాల్లో ఆయనపై నమ్మకంపై మాత్రం చచ్చిపోలేదు. ‘డిస్కోరాజా’తో రవితేజ మళ్లీ పూర్వ వైభవాన్ని పొందుతారని నమ్మకంతో ఉన్నారు. నిజానికి ‘నేల టిక్కెట్’ బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైన తరవాత కూడా కిందటేడాది డిస్ట్రిబ్యూటర్లు ‘అమర్ అక్బర్ ఆంటొని’పై బాగానే కాసులు కురిపించారు. ఈ సినిమా రూ.22 కోట్లకు అమ్ముడుపోగా కేవలం రూ.6 కోట్లు మాత్రమే షేర్ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టం జరిగింది.అయినప్పటికీ, ‘అమర్ అక్బర్ ఆంటొని’ ప్రభావం ‘డిస్కోరాజా’ పడలేదు.

ఈ సారి కథా పరంగా .. బడ్జెట్ పరంగా నటుడు రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ‘డిస్కోరాజా’ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సారి ఆయన తన మార్క్ ఎంటర్టైన్మెంట్ కి సైన్స్ ను యాడ్ చేసుకున్నాడు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా కూడా ఇదేనట. అదిరిపోయే నిర్మాణ విలువలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లను కూడా ఎట్రాక్ట్ చేసింది.

దీంతో ‘డిస్కోరాజా’ థియేట్రికల్ రైట్స్‌ రూ.22 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అంతకుమించిన వసూళ్లను రాబట్టవలసి వుంటుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు గ్లామరస్ హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ చేయడం మరో విశేషం. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

The area-wise break up are as follows:
Nizam : Rs 6.00 Cr
Ceded : Rs 2.75 Cr
UA : Rs 1.95 Cr
Guntur : Rs 1.50 Cr
Krishna : Rs 1.25 Cr
East Godavari : Rs 1.25 Cr
West Godavari : Rs 1.05 Cr
Nellore : Rs 0.65 Cr

Total AP/TS Pre release business of Disco Raja : Rs 16.40 Cr
Karnataka: Rs 1.10 Cr
ROI: Rs 0.50 Cr
OS: Rs 1.50 Cr

Total Worldwide pre release business of Disco Raja : Rs 19.50 Cr