రామ్ గోపాల్ వర్మ ఆఫీసు వద్ద దిశ తండ్రి ఆందోళన

0
573
Disha Father Protest At Ram Gopal Varma Office

disha father protest: ఇటీవల కొన్ని వాస్తవ సంఘటనలను సినిమాలుగా తీసి తరచూ వివాదంలో ఉంటున్న రామ్‌గోపాల్‌ వర్మ ..తాజాగా దిశ ఘటన ఆధారంగా దిశ ఎన్‌కౌంటర్‌ సినిమా తీస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఆ సినిమాను తక్షణమే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దిశ తండ్రి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలా జరిగితే ఆ ఇతి వృత్తంతో సినిమా తీస్తారా అంటూ నిలదీస్తున్నారు మహిళా సంఘాల నేతలు.

జ్లూబ్లీహిల్స్‌లోని ఆయన కార్యాలయాన్ని ముట్టడించి…సినిమాను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కన్న కుమార్తె పోయిందని పుట్టెడు శోకంలో మేముంటే..సమాజాన్ని చైత్యనపరిచేందకూ సినిమా తీస్తున్నానని వర్మ అంటున్నారని…ఇది సరికాదని దిశ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనతో ఎమ్మెల్యే ఎంపీ కాలనీ వద్ద ఉత్త వాతావరణం నెలకొంది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

Disha Father Protest At Ram Gopal Varma Office at hyderbad

దిశ ఎన్‌కౌంటర్‌ను సినిమాను ప్రభుత్వం బ్యాన్‌ చేయాలని కోరారు. ఆయన సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ కోర్టులో దిశ తండ్రి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్‌ నుండి తొలగించాలని కోరారు. కాగా, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని దిశ తండ్రి చెబుతున్నారు.

Disha Father Protest At Ram Gopal Varma Office

ఇప్పటికే ఈ చిత్రంపై నిషేధం విధించాలని కోరుతూ దిశ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ..అభ్యంతరాలుంటే సెనార్స్‌బోర్డును ఆశ్రయించవచ్చునని పేర్కొంది. ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని సెన్సార్‌ బోర్డును ఆదేశించింది. గతేడాది దిశపై నలుగురు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన ఘటన తెలిసిందే. దీంతో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం వారిని ఎన్‌కౌంటర్ చేశారు.

Disha Father Protest At Ram Gopal Varma Office