ఓటీటీలోకి నితిన్ ‘మాస్ట్రో’ మంచి డీల్

0
44
Disney+ hotstar OTT bags Nithiin's Maestro streaming rights

Nithin’s Maestro OTT: నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం మాస్ట్రో. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తుండగా.. ఇస్మార్ట్ బ్యాటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ పలు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మిగిలి ఉన్న కొద్ది భాగం చిత్రీకరణను ఇటీవలే ముగించారు టీమ్.

 ఇందులో నితిన్ అంధుడైన పియానో ప్లేయర్ గా కనిపించనున్నారు.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక లాక్ డౌన్ ఎత్తివేయడంతో త్వరలోనే థియేటర్లు కూడా ఓపెన్ కాబోతుండడంతో.. సినిమా విడుదల తేదీపై ఫోకస్ పెట్టింది చిత్రయూనిట్. తాజా సమచారం మేరకు ఈ సినిమాను సుమారు రూ. 32 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 

ఇవి కేవలం స్ట్రీమింగ్ హక్కులు మాత్రమే. ఇంకా ఇతర హక్కులు మిగిలే ఉన్నాయి. ఇవన్నీ కలిపితే నిర్మాతకు మంచి లాభాలే. హాట్ స్టార్ డీల్ ద్వారానే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్స్ మిగిలాయట. ఆగస్ట్ నాటికి థియేటర్లు ఓపెన్ అయితే సినిమా విడుదల చేయాలని.. లేదంటే.. ఓటీటీలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట మేకర్స్. ఇక వచ్చే నెల జూలైలో పరిస్థితుల్ని బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.