Negative Review on Chiranjeevi Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా భోళా శంకర్. ఈ సినిమాని ఆగస్టు 11న విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన భోళా శంకర్ టీజర్ అలాగే సాంగ్స్ సినిమా పై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు మెహర్ రమేష్ కూడా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం సోషల్ మీడియాలో మొదలైందని చెప్పవచ్చు.
Negative Review on Chiranjeevi Bhola Shankar: ఇక వివరాల్లోకి వెళితే బోలా శంకర్ సినిమా తమిళ్ వేదలమ్ సినిమాని రీమేక్ గా వస్తున్నప్పటికీ కథలో తెలుగువారికి అలాగే చిరంజీవి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి తీసినట్టు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పడం జరిగింది. ఇక దీనికి తోడు రమేష్ పాత సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా బెంగళూరుకి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూటర్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చిరంజీవి భోలా శంకర్ ఎబో యావరేజ్ అని.. అలాగే వన్ టైం వాచ్ అంటూ కామెంట్ చేయగా.. బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్ అంటూ మరో కామెంట్ చేయడం జరిగింది. ఒకరకంగా ఈ సినిమాకి 90 కోట్లు పైగానే బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది.

వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన చిరంజీవి ఈ సినిమాతో మరో సంచలనాన్ని సృష్టించాలని ఎదురుచూస్తున్నారు. మరి ఈ డిస్ట్రిబ్యూటర్ చేసిన కామెంట్స్ ఎంతవరకు నిజమో కాదో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా చేస్తుండగా. కీర్తి సురేష్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాని ప్రొడ్యూసర్ అనిల్ సుంకర అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.