shraddha kapoor, Prabhas, Saaho, Akshay Kumar, Mission Mangal
shraddha kapoorshraddha kapoor, Prabhas, Saaho, Akshay Kumar, Mission Mangal

[INSERT_ELEMENTOR id=”3574″]

సాహో…భారీ బడ్జెట్ తో ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాని చూడడానికి దేశం అంతా ఆతృతగా ఎదురుచూస్తుంది.ఈ సినిమా ఎలా ఉంటుందా? అని మాత్రమే కాదు,సాహో సినిమాతో అనేక విషయాలు క్లారిఫై చెయ్యాల్సిఉంది.బాహుబలి తెచ్చిపెట్టిన గ్లోరీ ని యంగ్ రెబల్ స్టార్ సాహో తో కంటిన్యూ చెయ్యగలుగుతాడా? లేదా? అనేది చాలా ఆసక్తికరమయిన అంశం.అలాగే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ ప్రభాస్ ని కన్వీన్స్ చేసేలా చెప్పిన అంత గొప్ప కథ ఏంటి? అని తెలుసుకోవాలి అనే కుతూహలం అందరిలో ఉంది.

ఈ సినిమాలో అరడజనకు పైగా ఉన్న బాలీవుడ్ యాక్టర్స్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారు అన్న ప్రశ్నకి కూడా సమాధానం కూడా సాహో నే.ఇన్ని విశేషాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన సాహో ప్రస్తుతం వాయిదా పడింది.ముందు నుండి వినిపిస్తున్న న్యూస్ ని నిజం చేస్తూ ఇండిపెండెన్స్ డే రేస్ నుండి తప్పుకుంది సాహో.దానికి కారణం ఈ సినిమా VFX వర్క్ పూర్తికాకపోవడమే.సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే అతి కీలకమయిన ఫైట్ సీక్వెన్స్ కి సంబందించిన VFX పనులు ఇంకా కొలిక్కి రాలేదు.ఇంత పెద్ద సినిమా అనుకున్న టైం కి రిలీజ్ చెయ్యాలి అని పంతం పడితే క్వాలిటీ పరంగా సమస్యలు రావచ్చు.పైగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు భాషల్లో రిలీజ్ అవుతుంది సాహో.ఎందుకంటే రీసెంట్ గా పంజాబీలో కూడా సాహో రిలీజ్ అవుతుంది.సో,ఫైనల్ అవుట్ ఫుట్ పరంగా తప్పు అనేది దొర్లకూడదు.సో,ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే సాహో వాయిదా వెయ్యాలి అనేది మంచి నిర్ణయమే.సాహో రెండు వారాలు వెనక్కు వెళ్లడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు.సాహో ఆగస్టు 30 న రిలీజ్ చేసినా భారీ హైప్ ఉన్న మాగ్నమ్ ఒపస్ కాబట్టి ఆటోమ్యాటిక్ గా బజ్ క్రియేట్ అయిపోతుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

పైగా బాలీవుడ్ లో ఆగష్టు 15 న మిషన్ మంగళ్,బాట్ల హౌస్ రిలీజ్ అవుతన్నాయి.రెండు వారాల తరువాత సాహో వస్తే సోలో రిలీజ్ తో బాక్స్ ఆఫీస్ మొత్తం కబ్జా చెయ్యొచ్చు.హిట్ టాక్ వస్తే బాహుబలి లా విజృంభించే ఛాన్స్ ఉంటుంది.పైగా T -సిరీస్ సైతం బాట్ల హౌస్ నిర్మాణంలో కూడా పాలు పంచుకుంది.కాబట్టి వాళ్ళు కూడా సాహో వాయిదాన్ని సంతోషంగా ఒప్పుకుంటున్నారు.పైగా సాహో నుండి ఇప్పటివరకు ఒకే ఒక్క సింగిల్ బయటికి వచ్చింది.దాంతో రావాల్సిన బజ్ దక్కలేదు.లాస్ట్ మినిట్ వరకు పనులు పెట్టుకుని కూర్చుంటే ప్రమోషన్స్ లో ఫెయిల్ అవుతారు.అందుకే సాహో వాయిదా పడడం అనేది మంచి విషయమే.సాహో వాయిదా పడుతుంది అని నాగార్జునకి ముందే తెలిసి మరీ మన్మధుడు-2 న ఆగస్టు 9 కి ఫిక్స్ చేశాడా అనే డౌట్ వస్తుంది ఇప్పుడు.

ఇక సాహో వాయిదా పడింది అన్నవిషయం పక్కా.ఎందుకంటే ప్రభాస్ కి,UV క్రియేషన్స్ కి శర్వానంద్ తో ఉన్న బాండింగ్ వేరు.అందుకే సాహో వస్తుంది అని రణరంగం సినిమాని ఏకంగా సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నాడు.కానీ ఇప్పడు ఆగస్టు 15 డేట్ ఇచ్చేసారు.అలాగే అడివి శేష్ తాను నటించినా ఎవరు? సినిమా ఆగస్టు 15 రిలీజ్ అని తేల్చేసారు.సాహో బరిలో ఉంటే ఈ రెండు సినిమాలు ఆగస్టు 15 అనే డేట్ ని టచ్ చేసేవి కాదు.ఇక ఇప్పుడు ప్రాబ్లెమ్ నాని సినిమా గ్యాంగ్ లీడర్ కే.సాహో కి రెండు వారాల గ్యాప్ తో ఆగస్టు 30 న రిలీజ్ అనుకున్న నాని సినిమా సెప్టెంబర్ రెండో వారానికి వెళ్ళింది.మొత్తానికి సాహో రిలీజ్ అయితే వేవ్స్ క్రియేట్ అవుతాయి అనుకుంటే ,పోస్ట్ పోన్ అయినా కూడా ప్రకంపనలు వస్తున్నాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]