Anand Devarakonda Dorasani Telugu Movie Review
Anand Devarakonda Dorasani Telugu Movie Review

Dorasani Telugu Movie Review

విడుదల తేదీ : జూలై 12, 2019
రేటింగ్ : 2/5
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక
దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర
నిర్మాత‌లు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
సంగీతం : ప్రశాంత్ ఆర్ వర్మ
సినిమాటోగ్రఫర్ : సన్నీ కూరపాటి
ఎడిటర్ : నవీన్ నూలి

[INSERT_ELEMENTOR id=”3574″]

దొరసాని…ఈ సినిమా స్టార్ట్ అయినా దగ్గరినుండి కూడా ఈ సినిమాపై అంతా ఆసక్తిని పెంచుకున్నారు.దానికి కారణం ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్న హీరో హీరోయిన్స్.ఈ సినిమా హీరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో పాపులర్ అయినా విజయ్ దేవరకొండ కి స్వయానా తమ్ముడు,అలాగే ఈ సినిమా టైటిల్ రోల్ లో నటించిన శివాత్మిక జీవిత రాజశేఖర్ ల కూతురు.అందుకే ఈ సినిమాకి ముందే భారీ హైప్ వచ్చింది.ట్రైలర్ లవ్ ఫీల్ తో ఇంప్రెసివ్ గా అనిపించింది.అలాగే ఈ సినిమాలో రెండు సాంగ్స్ కూడా బావుండడంతో దొరసాని పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మరి ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

దొరసాని కథ గురించి కొత్తగా ఏమీ లేదు,కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.ట్రైలర్ లో చూపించినట్టు మేడలో దొరసాని,పాకలో కూలోడి కొడుకు మధ్య చిగురించిన ప్రేమ కథ.గతంలో వచ్చిన చాలా సినిమాల్లానే ఈ సినిమాలో కూడా వాళ్ళ ప్రేమకు ఆస్తిపాస్తుల్లోని అంతరాలు అవాంతరాలుగా మారతాయి.దొరసాని తండ్రి వాళ్ళ ప్రేమకు అడ్డు పడడం,దాన్ని దాటి వాళ్ళు వాళ్ళ ప్రేమను గెలిపించుకున్నారా?, లేక పెద్ద తనానికి తలొంచి విడిపోయారా అనేది సినిమాలో కీలకమయిన పాయింట్.కానీ అక్కడ చాలా వరకు ఊహించినట్టే జరిగినా తెలుగులో పెద్దగా అచ్చిరాని నెగెటివ్ క్లయిమాక్స్ ని ఎంచుకోవడం మాత్రం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

విశ్లేషణ:

ఈ సినిమాకథలో కొత్తదనం లేదు అని తెలిసిన పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం ఏమైనా చేసుంటారా? అనే అభిప్రాయం కలిగింది ట్రైలర్ చూసినప్పుడు.అయితే ఏ సినిమాకథలో ఎలాంటి కొత్తదనం లేదు.అదే రాజు-పేద ప్రేమకథ.కాకపోతే ఈ కథ జరిగే ప్రాంతం,ఆ ప్రేమ కథ నేపధ్యం తెలంగాణ అవడంతో కాస్త డిఫరెంట్ గా కనిపించింది.కానీ దీన్ని ఒక పొయెటిక్ వే లో విజువల్స్ అండ్ మ్యూజిక్ కలిపి చెప్పాలి అని అనుకున్నారు.అయితే సన్నివేశాల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది అని పట్టించుకోలేదు.సినిమా కథ తెలిసిందే,కథనం కూడా ఊహలకు తగ్గట్టే సాగుతుండడంతో సినిమాలో కిక్ అనేది లేకుండా పోయింది.దానికి తోడు వాళ్ళ ప్రేమని కానీ,వాళ్ళు విడిడిపోతుంటే ఉండే పెయిన్ గానీ ప్రేక్షకులకు ఏ మాత్రం టచ్ కాలేదు.దానికి తోడు హీరో,హీరోయిన్స్ చనిపోవడం అనే క్లయిమాక్స్ దొరసాని పై మరింత నెగెటివ్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.ఓవర్ ఆల్ గా దొరసాని ఒక మామూలు సగటు ప్రేమ కథగా మిగిలింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

నటీనటులు:

ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ నటన ఎలా ఉంటుంది? అనే ఆతృతతో చాలామంది థియేటర్స్ కి వెళ్లారు.ఈ సినిమాలో హీరో గా నటించిన ఆనంద్ దేవరకొండ నటన చూపించడానికి పెద్దగా స్కోప్ లేదు.ఉన్న సీన్స్ లో బాగానే చేసాడు.వాయిస్ కల్చర్ మాత్రం అచ్ఛం విజయ్ దేవరకొండ లా ఉంది.ప్రస్తుతానికి లవ్ స్టోరీస్ కి మాత్రమే సూట్ అవుతుంది అతని పెర్సనాలిటీ.పేస్ లో కూడా ఇంకా మెచూరిటీ అవసరం.అతని స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం డీసెంట్ గా ఉంది.ఇక శివాత్మిక మాత్రం ట్రెడిషనల్ వేర్ లో చాలా అందంగా అనిపించింది.జీవిత పోలికలతో ఉండడంతో మళ్ళీ ఒకప్పటి జీవితను గుర్తుచేసింది.నటన పరంగా అక్కడక్కడా తడబడినా మొదటి సినిమాకి ఆ రేంజ్ నటన అంటే మెచ్చుకోవాలి.ఆమెని స్క్రీన్ పై చూపించే విషయంలో కాస్త ఎక్కువ కేర్ తీసుకున్నారు.నక్సలైట్ గా నటించిన కిషోర్ నటన మెప్పిస్తుంది.మిగతా నటీనటులంతా పెద్దగా పరిచయం ఉన్నవాళ్లు కాకపోయినా చాలా నేచురల్ గా నటించారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

టెక్నీషియన్స్:

దొరసాని సినిమాకి రచయిత,దర్శకుడు అయిన KVR మహేంద్ర కి ఈ సినిమా ఎలా తియ్యాలి అనే విషయంలో ఒక క్లారిటీ ఉండడంతో పాతకథ అనే విషయం పట్టించుకోలేదు.కానీ చిన్న చిన్న డీటెయిల్స్ పై కూడా చాలా శ్రద్దగా వర్క్ అవుట్ చేసాడు.డైలాగ్స్ కూడా చాల సహజంగా ఉన్నాయి.కాకపోతే ఇలాంటి సినిమాలకు అవసరమయిన ఫీల్ మాత్రం వర్క్ అవుట్ కాలేదు.దాంతో సినిమా చాలా స్లో గా సాగింది.ల్యాగ్ లా అనిపించింది.సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ మాత్రం దొరసానికి ఎస్సెట్.దొరసాని సినిమాని చివరివరకు చూడగలగడంలో సన్నీకి కూడా క్రెడిట్ ఇవ్వాలి.తెలంగాణ పల్లె అందాలను బాగా చూపించాడు.దొరసాని ని కూడా అందంగా చూపించాడు.ప్రశాంత్ విహారి మ్యూజిక్ కూడా దొరసాని కి బలంగా నిలిచింది.రెండు పాటలు చాల బావున్నాయి.ఆర్.ఆర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే.నిర్మాణ విలువలు బావున్నాయి.

ఫైనల్ గా:

పాత తరహా కథాకథనాలతో తెరకెక్కిన దొరసాని తక్కువగా అలరిస్తూ ఎక్కువగా సాగదీసినట్టు అనిపిస్తుంది.మరి ఈ సినిమా ఏ స్థాయి విజయం అందుకుంటుంది అనేది వేచి చూడాలి.

బోటమ్ లైన్:పాతకాలం దొరసాని

 

[INSERT_ELEMENTOR id=”3574″]