Homeట్రెండింగ్పూరి పర్ఫెక్ట్ ప్లాన్.. పూజా కార్యక్రమాలతో డబుల్ ఇస్మార్ట్ జాతర షురూ.!!

పూరి పర్ఫెక్ట్ ప్లాన్.. పూజా కార్యక్రమాలతో డబుల్ ఇస్మార్ట్ జాతర షురూ.!!

Ram Pothineni Next Double Ismart Shankar launched with Pooja today and shooting update, Ismart Shankar Pooja launch photos, Ram pothineni new movie details, Double Ismart Shankar shooting start date, Cast Crew details

Ram Double Ismart Update: ఇస్మార్ట్ శంకర్ తో రామ్ పోతినేని బాక్సాఫీస్ వద్ద భారీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించక, చార్మి ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ శంకర్ అంటూ మళ్ళీ ఈ హిట్ కంబో షూటింగ్ మొదలుపెట్టడానికి రెడీ అయ్యారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాని ప్రారంభించారు మేకర్స్.

Ram Double Ismart Update: నేడు హైదరాబాదులో రామానాయుడు స్టూడియోస్ లో డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్ని ముగించుకొని సినిమాని అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. మరోసారి పూరీ జగన్నాథ్ అలాగే చార్మి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని కెరియర్ లోనే ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్టుగా నమోదు చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత తనకు ఆశించిన స్థాయిలో ఏం సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు.

అదేవిధంగా పూరి జగన్నాథ్ కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ బాక్సాఫీస్ దొరకలేదు. మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేయడం ఒకరకంగా దర్శకుడికి బూస్ట్ ఇచ్చినట్టే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12వ తారీకు నుంచి హైదరాబాదులో జరగబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ అని ముగించుకొని 2024 మా శివరాత్రికి (మార్చ్ 8వ) విడుదల చేయాలని పక్కా ప్లాన్ తో పూరి జగన్నాథ్ ఉన్నట్టు మూవీ వర్గాల వారు చెప్తున్నారు.

Double Ismart launched with Pooja today
Double Ismart launched with Pooja today

ప్రస్తుతం రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమాతో రామ్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నారు. దీని తర్వాత రాబోయే పూరి జగన్నాథ్ సినిమా కూడా అనుకున్న స్థాయిలో భారీ విజయాన్ని సాధిస్తే అటు దర్శకుడికి అలాగే హీరోకి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినట్టే. అయితే డబల్ ఇస్మార్ట్ శంకర్ లో నటి నటుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

Double Ismart launched with Pooja today and shooting update, Ismart Pooja launch photos, Ram pothineni new movie details, Double Ismart shooting start date, Cast Crew details

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY