Thalapathy Vijay, BIGIL Movie Details
Thalapathy Vijay, BIGIL Movie Details

తమిళ తలపతి విజయ్-యంగ్ డైరెక్టర్ అట్లీ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ కి బిజిల్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.గతంలో తేరి తో 100 కోట్ల వసూళ్లు,మెర్సల్ తో 200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన కాంబినేషన్ ఇది.అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.విజయ్ బర్త్ డే సందర్భంగా బిజిల్ సినిమా ఫస్ట్ లుక్ అండ్ సెకండ్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసాడు అట్లీ.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ తండ్రి,కొడుకు పాత్రలలో డ్యూయల్ రోల్ చేసుకున్నాడు.మెర్సల్ లో ఏకంగా విజయ్ చేత ట్రిపుల్ రోల్ చేయించిన అట్లీ ఈ సారి డబుల్ రోల్ కి ఫిక్స్ అయ్యాడు.ఒక రోల్ లో జాలరిగా ఫుల్ మాస్ గెట్ అప్ తో ఉన్న విజయ్ మరొక రోల్ లో యంగ్ బాస్కెట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తున్నాడు.అయితే 44 ఏళ్ళ వయసులోనూ సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నాడు విజయ్.ఈ రెండు లుక్స్ తో సోషల్ మీడియా ని హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్.

సెలబ్రిటీ లు కూడా ట్వీట్స్ అండ్ రీ ట్వీట్స్ తో బిజిల్ సౌండ్ కి మరింత బూస్టింగ్ ఇస్తున్నారు.ఈ సినిమాలో నయనతార ఫిమేల్ లీడ్ గా నటించడం మరో ఆకర్షణ.ఓవర్ ఆల్ గా మరో భారీ కమర్షియల్ హిట్ కి ఫస్ట్ లుక్ తో నాంది పలికారు అట్లీ అండ్ విజయ్.

[INSERT_ELEMENTOR id=”3574″]