Dr Rajasekhar to do an emotional thriller next
Dr Rajasekhar to do an emotional thriller next

సీనియర్ హీరో డా. రాజశేఖర్ సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ థ్రిల్లర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. కాగా వచ్చే వారం నుండి మొదలుకానున్న షెడ్యూల్ లో ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఎమోషనల్ సాగే ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారు. సింగిల్ లైన్ కథ వినగానే ఎగ్జైట్ అయిన రాజశేఖర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు.

కాగా ఇటీవల విడుదలైన ‘కిల్లర్’ సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్. కె. కింగ్ డా. రాజశేఖర్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. తెలుగు ‘క్షణం’ను శిబిరాజ్ తో ‘సత్య’గా తీయటంతో పాటు ‘బేతాళుడు’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మార్చి 2020లో ఈ సినిమాను విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. మరి రాజశేఖర్ కి ఈ సినిమా తన కెరీర్ లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందేమో చూడాలి.