వచ్చే నెల నుండే తెలుగు దృశ్యం 2 షూటింగ్

220
drishyam-2-telugu-remake-starts-shooting-in-march
drishyam-2-telugu-remake-starts-shooting-in-march

మలయాళం దృశ్యం 2013లో ఎటువంటి హడావిడీ లేకుండా విడుదలయిన సినిమా. కానీ ఈ సినిమా కనక వర్షం కురిసేలా చేసింది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయింది.

 

 

తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనాలు ఈ సినిమాను తెరకెక్కించారు,ఈ సినిమా తెలుగులో కూడా భారీ హిట్ అయింది. అయితే ఈ సినిమా మలయాళం సీక్వెల్ నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది. దాంతో మళ్ళీ అప్పుడు దృశ్యం ను రీమేక్ చేసిన వారంతా ఇప్పుడు ఈ దృశ్యం 2 ను కూడా రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

 

అందులో వెంకీ కూడా ఉన్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగులో దృశ్యం 2 రీమేక్ వచ్చే నెల నుండే ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నారప్ప, ఎఫ్ 3 లో నటిస్తున్న వెంకీ ఇప్పుడు ఈ సినిమాను కూడా ప్రారంభించనున్నాడు అని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.