మలయాళం దృశ్యం 2013లో ఎటువంటి హడావిడీ లేకుండా విడుదలయిన సినిమా. కానీ ఈ సినిమా కనక వర్షం కురిసేలా చేసింది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయింది.
తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనాలు ఈ సినిమాను తెరకెక్కించారు,ఈ సినిమా తెలుగులో కూడా భారీ హిట్ అయింది. అయితే ఈ సినిమా మలయాళం సీక్వెల్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది. దాంతో మళ్ళీ అప్పుడు దృశ్యం ను రీమేక్ చేసిన వారంతా ఇప్పుడు ఈ దృశ్యం 2 ను కూడా రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అందులో వెంకీ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. మార్చి 5 నుంచి రోజువారీ షూటింగ్ జరగునున్నట్టు చిత్రబృందం తెలిపింది. కొవిడ్ ప్రభావం ఇంకా తగ్గని కారణంగా పరిమిత సిబ్బందితోనే చిత్రీకరణ చేయనున్నారు. ప్రస్తుతం నారప్ప, ఎఫ్ 3 లో నటిస్తున్న వెంకీ ఇప్పుడు ఈ సినిమాను కూడా ప్రారంభించాడు .