Sara Ali Khan and Rakul Preet Singh Allegedly Consumed Drugs says report

Rakul Preet Singh Drug Case: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్వీస్ట్ బయటపడింది. రియా (rhea chakraborty) చెప్పిన కొన్ని పేర్లతో డ్రగ్స్ ప్రకంపనలు టాలీవుడ్ ను తాకాయి. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ (sara ali khan) పేర్లు తెరపైకి వచ్చాయి.

నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో ఇంటరాగేషన్‌లో బాలీవుడ్ నటి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు… రియా చక్రవర్తి… బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను బయటపెట్టినట్లు తెలిసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్‌లో దాదాపు 25 మంది సినీ ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లుగా గత రెండు రోజులుగా మీడియాలో కథనాలు చూస్తున్నాం. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వారిలో ఎక్కువగా బాలీవుడ్ అగ్ర హీరో హీరోయిన్లే ఉన్నట్లు తెలిసింది.

తాను డ్రగ్స్ సప్లై చేసిన వాళ్లలో వాళ్లిద్దరూ ఉన్నట్లు తెలిపింది. రకుల్ పేరు బయటకురావడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. రియా ఫోన్ కాల్ డేటాలో తెలుగు హీరో, హీరోయిన్లు నంబర్లు దొరికినట్టు సమాచారం. రకుల్ ప్రీత్‌‌కు రియాకు మధ్య మంచి స్నేహం ఉందని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పలు వార్తలు షికారు చేస్తున్న ఈ తరుణంలో డ్రగ్స్ రాకెట్‌లో అమ్మడి పేరు బయటపడటం హాట్ టాపిక్ కావడమే గాక జనాల్లో పలు అనుమానాలకు తావిచ్చింది.