Homeసినిమా వార్తలు'అరేయ్ సాంబా.. రాస్కోరా'.. మ్యాజికల్ మ్యూజికల్ కాంబో ఈజ్ బ్యాక్!

‘అరేయ్ సాంబా.. రాస్కోరా’.. మ్యాజికల్ మ్యూజికల్ కాంబో ఈజ్ బ్యాక్!

DSP For Ustaad Bhagat Singh.. Devi Sri Prasad Begins music section for Ustaad Bhagat Singh shooting update, Location, Pawan Kalyan, Harish Shankar, Sreeleela, Ustaad Bhagat Singh latest news

DSP For Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కలయికలో తెరకెక్కిన మూవీ ‘గబ్బర్ సింగ్’. 2012లో ‘దబాంగ్’ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దశాబ్ద కాలం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో ‘ఉస్తాడ్ భగత్ సింగ్’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

DSP For Ustaad Bhagat Singh: ‘గబ్బర్ సింగ్’ కు చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (DSP).. ఇప్పుడు ‘ఉస్తాడ్ భగత్ సింగ్’ సినిమా కోసం వర్క్ చేయనున్నారు. ఆదివారం దర్శకుడు, సంగీత దర్శకుడి మధ్య ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ (Music) సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ‘మ్యాజికల్ మ్యూజికల్ కాంబో ఈజ్ బ్యాక్’ అంటూ ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ వీడియో ద్వారా తెలియజేసింది.

ఇందులో హరీశ్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) లు సంగీత చర్చలు జరుపుతూ కనిపించారు. ఈ వీడియోలో ‘ది బ్లాక్ బస్టర్ గబ్బర్ మ్యాజికల్, మ్యూజికల్ కాంబో ఈజ్ బ్యాక్.. బ్లాక్ బస్టర్ జామ్ సెషన్ బిగిన్స్’ అని పేర్కొన్నారు. అలానే ‘గబ్బర్ సింగ్’ లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పిన ‘అరేయ్ సాంబా.. రాస్కోరా’ అనే డైలాగ్ ను జోడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Devi Sri Prasad Begins music section for Ustaad Bhagat Singh

బ్లాక్ బస్టర్ డైరక్టర్, రాక్ స్టార్ కలిసి ఈసారి ‘ఉస్తాడ్ భగత్ సింగ్’ తో మెమరబుల్ ఆల్బమ్ ఇవ్వడానికి రెడీ అయ్యారని మేకర్స్ ట్వీట్ చేశారు. దీనికి డీఎస్పీ స్పందిస్తూ.. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ తో డియర్ సర్ జీ హరీష్ శంకర్ & మైత్రీ మూవీ మేకర్స్ తో మరోసారి రాక్ చేద్దాం అని రీట్వీట్ చేశారు.

కాగా, తమిళ్ లో హిట్టయిన ‘తెరీ’ రీమేక్ గా ‘ఉస్తాడ్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh shooting) సినిమా తెరకెక్కుతుంది. వై. రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మాతలు. ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఒక హీరోయిన్ గా శ్రీలీల (Heroine Sreeleela) నటిస్తోంది. ఇటీవలే సెట్స్ మీదకెళ్లిన ఈ చిత్రం.. పది రోజులు షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ను కూడా రీసెంట్ గా మొదలుపెట్టేశారు.

- Advertisement -

అయితే 2023 మే 11వ తేదీ నాటికి ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి 11 ఏళ్లు అవుతుంది. సెంటిమెంట్ గా అదే రోజున ‘ఉస్తాడ్ భగత్ సింగ్’ నుంచి ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేసి, మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారని అంటున్నారు. ఇదే నిజమైతే పీకే ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పాలి. మరి హరీశ్ శంకర్ ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY