Homeసినిమా వార్తలుBoyapatiRAPO: రామ్ పోతినేని సినిమాకి డబ్బింగ్ మొదలుపెట్టిన బోయపాటి..!!

BoyapatiRAPO: రామ్ పోతినేని సినిమాకి డబ్బింగ్ మొదలుపెట్టిన బోయపాటి..!!

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ చిత్రం #BoyapatiRAPO శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, మాస్‌ ఎక్కువగా ఉండబోతున్నాయి.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యంత నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమైయ్యాయి. ఈ మేరకు డబ్బింగ్ స్టూడియో నుంచి దర్శకుడు బోయపాటి ఫోటోని మేకర్స్ రిలీజ్ చేశారు.

boyapati srinu begins dubbing works for ram movie

ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ కు జోడిగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ పాత్రలలో కొంతమంది ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ అందిస్తుండగా, సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. #BoyapatiRAPO దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది.

Web Title: Dubbing works kickstarted for Boyapati – Ram Pothineni film.. boyapati srinu begins dubbing works for ram movie. Sreeleela and Ram pothineni next movie shooting update

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY