సీతారామం 2 సినిమా పై క్లారిటీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్

Sita Ramam 2: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం‘ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సినిమా కాసుల వర్షం కురిపించింది. అయితే సీతారామం సీక్వెల్ (Sita Ramam Sequel) ఉంటుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సీతారామం 2 (Sita Ramam Sequel) ఈ సినిమా గురించి అధికారికంగా గానీ లేదంటే ప్రొడ్యూసర్ గానీ ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు ఇంతవరకు. సీతారామం సినిమా హీరో దుల్కర్ సల్మాన్ వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. ఇదే విషయాన్నీ తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ని అడిగాడు ఓ రిపోర్టర్.

“ఓ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచినప్పుడు దాన్ని సీక్వెల్ పేరుతో మళ్లీ టచ్ చేయొద్దని నేను నటుడిని కాకముందే నిర్ణయించుకున్నాను. మేము సీతారామం కథను బాగా నమ్మి, క్లాసికల్ హిట్ గా నిలుస్తుందని ముందే భావించాం. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకులు మా సినిమాను తమ గుండెల్లో నిలుపుకున్నారు. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని అనుకుంటున్నా. అలాగే రీమేక్ విషయంలో కూడా అంతే” అంటూ సమాధానం ఇచ్చారు.

కొద్ది రోజుల క్రితమే సీతారామం సినిమా మలయాళం వర్షన్ అలాగే హిందీలోనూ విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అని ఈ సినిమాతో మరోసారి రుజువైంది.

 

Related Articles

Telugu Articles

Movie Articles