Homeసినిమా వార్తలుదుల్కర్ సల్మాన్ - వెంకీ అట్లూరి నెక్స్ట్ లక్కీ భాస్కర్ టైటిల్ పోస్టర్ విడుదల.!!

దుల్కర్ సల్మాన్ – వెంకీ అట్లూరి నెక్స్ట్ లక్కీ భాస్కర్ టైటిల్ పోస్టర్ విడుదల.!!

Dulquer Salmaan Lucky Baskhar Title poster released, Dulquer Salmaan New movie details, Dulquer Salmaan and Venky Atluri new movie Lucky Baskhar shooting update

దుల్కర్ సల్మాన్ వివిధ భాషల్లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ యంగ్ స్టార్ పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత తరంలోని ఉత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిని పొందారు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పాపులర్ స్టార్. తన గత చిత్రం ‘సీతారామం’తో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్, తన తదుపరి పాన్-ఇండియా చిత్రం కోసం దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపారు.

ధనుష్ తో చేసిన సార్(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రం సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడిగా ఆయన ఖ్యాతిని పెంచింది. సార్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి, ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు. ఆయన తదుపరి సినిమా కోసం సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సార్(వాతి)ని కూడా వారే నిర్మించడం విశేషం. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. దుల్కర్ సల్మాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వెంకీ అట్లూరి మరో విభిన్న కథాంశంతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.

Dulquer Salmaan New Movie Lucky Baskhar Title poster released
Dulquer Salmaan New Movie Lucky Baskhar Title poster released

‘నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ’గా ఈ చిత్రం రూపొందుతోందని ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రానికి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఇది సినిమా ప్రేమికులకు థియేటర్‌లలో గొప్ప అనుభూతిని కలిగించే చిత్రమవుతుందని మేకర్స్ పేర్కొన్నారు.

జాతీయ అవార్డు గ్రహీత, సార్(వాతి)కి చార్ట్‌బస్టర్ సంగీతం అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Dulquer Salmaan Lucky Baskhar Title poster released, Dulquer Salmaan New movie details, Dulquer Salmaan and Venky Atluri new movie Lucky Baskhar shooting update

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY