టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కీలక ముందడుగు..!

0
36
Puri Jagannadh, Rana Daggubati, Rakul Preet Singh Tollywood drugs case

Tollywood Drugs Case : తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఒక్కసారిగా డ్రగ్స్ కేసులో కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఉండడం అందరిని షాక్ కు గురి చేసింది. అసలు వారికి ఎంత వరకు సంబంధాలు ఉన్నాయనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో చిన్న పెద్దా అని తేడా లేకుండా చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటుల, దర్శకుల చుట్టూ డ్రగ్స్ రాకేట్ ఉచ్చు బిగుసుకుంది.

కొన్నేళ్ల క్రితం అంతా ముగిసిపోయింది అనుకున్న టాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో ఈసారి ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్) ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈడీ దృష్టికి వెళ్లడంతో ఈ కేసులో పెద్ద విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొంత మంది సెలబ్రిటీలు డ్రగ్స్ మాఫియాకు హవాలా రూపంలో చెల్లింపులు చేసింది. ఇపుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇపుడు కీలక అడుగులు వేసింది. అంతేదు హవాల రూపంలో జరిగిన లావాదేవీలపై ఇంటర్‌పోల్ సహాయం తీసుకోవాలనుకుంటోంది.

ED proactive on Tollywood drugs case

ఇక మంగళవారం నుంచి ఇండస్ట్రీలోని 12 మంది ప్రముఖుల్ని డ్రగ్స్ కేసుకు సంబంధించి వివిధ అంశాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. వీళ్లలో పూరి జగన్నాధ్, చార్మి, రానా, రకుల్, రవితేజ వంటి స్టార్స్ ఉన్నారు. సినీ స్టార్స్ ఎకౌంట్ నుంచే డబ్బు ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తిస్తే.. ఫెమా చట్టాన్ని అమలు చేసేందుకు కూడా ఈడీ సిద్ధమౌతున్నట్టు కథనాలు వస్తున్నాయి.

 

Previous articleశ్రీకృష్ణాష్టమి స్పెషల్ గా “రాధేశ్యామ్” రొమాంటిక్ పిక్
Next article‘నాగ శౌర్య , రీతువర్మ’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల