‘ఈ మాయలో..’ ఏక్ మినీ కథ నుంచి అందమైన మెలోడీ

1285
Ee Maya Lo Song Lyrical Video | EEk Mini Katha Moviek Mini Katha Movie Songs | Santosh Shoban | Pravin Lakkaraju
Ee Maya Lo Song Lyrical Video | EEk Mini Katha Moviek Mini Katha Movie Songs | Santosh Shoban | Pravin Lakkaraju

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు.

 

ఈ బ్యాన‌ర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది. ‘డస్ సైజ్ మ్యాటర్’ అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన లుక్ కు మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని ఈ మాయలో.. లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

మంచి సాహిత్యంతో పాటు ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఈ పాటకు మరింత వన్నె తీసుకొచ్చింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 

గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.