బుల్లితెరపై ఎన్టీఆర్ మ్యాజిక్..!

0
1664
NTR's EMK Show makes Gemini TV TRP jump big

Jr NTR’s EMK: హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి ఆధారంగా తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరులు అనే కార్యక్రమం రూపొందిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ షోకి నాగార్జున, చిరంజీవి హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఆ సమయంలో టీఆర్పీ పెద్దగా రాకపోవడంతో కొద్ది రోజులు షోకి బ్రేక్ పడింది. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఎన్టీఆర్ హోస్ట్‌గా షో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజాగా ఈ గేమ్ షోతో మరోసారి బుల్లితెరపై తన మార్క్ మ్యాజిక్ సృష్టించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” జక్కన్న దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో ప్రసారమైన “ఎవరు మీలో కోటీశ్వరులు” షో కర్టెన్-రైజర్ ఎపిసోడ్‌ కు రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆగస్టు 22, 23న ప్రసారం అయిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభ ఎపిసోడ్‌కు సంబంధించిన రేటింగ్ తాజాగా వెలువడింది.

NTR Evaru Meelo Koteeswarulu enters TRP race

చరణ్ ముఖ్య అతిథిగా రావడం అందరిలో ఆసక్తిని పెంచేసింది. తాజాగా ఈ షో రేటింగ్‌లు వచ్చాయి. “ఎవరు మీలో కోటీశ్వరులు” మొదటి ఎపిసోడ్‌కు 11.4 రేటింగ్ వచ్చింది. వారంలో ఈ షో సగటు రేటింగ్ 5.6. ఎన్టీఆర్ మ్యాజిక్ బాగా పని చేయడంతో జెమిని టీవీ 290 జిపిఆర్ నుండి 400 జిపిఆర్ కు వెళ్లింది. బిగ్ బాస్ షోతో బుల్లితెరపై అదరగొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతోను సరికొత్త రికార్డ్ సృష్టించాడు.