Homeసినిమా వార్తలువిజయ్ ఆంటోనీ 'హత్య' నుంచి "ఎవరు నువ్వు?" పాట విడుదల

విజయ్ ఆంటోనీ ‘హత్య’ నుంచి “ఎవరు నువ్వు?” పాట విడుదల

Evaru Nuvvu Song from Hatya Movie released, Hatya movie release date, Hatya movie trailer, Hatya movie cast crew, Vijay Antony, Vijay Antony new movie, Vijay Antony latest news

Evaru Nuvvu Song from Hatya Movie: బిచ్చగాడు-2 మూవీతో రీసెంట్‌ సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ అంటోని.. మరో సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. సరికొత్త లైన్‌తో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో హత్య సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు.

Evaru Nuvvu Song from Hatya Movie: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా రితికా సింగ్ నటిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఎవరు నువ్వు..? అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ మేకర్స్ రిలీజ్ చేశారు.

ఎవరు నువ్వు..? అంటూ సాగే ఈ పాట.. ప్రేక్షకులను సరికొత్త ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్లేలా ఉంది. ఈ పాటను ఎంఎస్ కృష్ణ, అంజనా రాజగోపాలన్ ఆలపించగా.. భవ్యశ్రీ సాహిత్యం అందించారు. గిరీష్ గోపాలకృష్ణన్ అందించిన మ్యూజిక్ వినసొంపుగా ఉంది. ఈ పాటతో సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు మూవీ మేకర్స్.

బాలాజీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హత్య మూవీ జూలై 21న థియేటర్లలోకి రాబోతుంది. కంప్లీట్ మేకోవర్‌తో.. సరికొత్త కొత్త లుక్‌లో స్టైలీష్‌గా విజయ్ ఆంటోని కనిపిస్తున్నాడు. కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు విజయ్.. మరోసారి అలాంటి స్టోరీనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ హత్య మూవీని నిర్మిస్తోంది. కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.

Evaru Nuvvu Song from Hatya Movie released

ఈ చిత్రంలో మురళీ శర్మ, మీనాక్షి చౌదరి, జాన్ విజయ్, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆర్కే సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Evaru Nuvvu Song from Hatya Movie released, Hatya movie release date, Hatya movie trailer, Hatya movie cast crew, Vijay Antony, Vijay Antony new movie, Vijay Antony latest news

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY